లక్ష్మీస్ ప్రీమియర్ రిపోర్ట్

ఈ సమ్మర్ సంచలన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా మరో రోజులో విడుదల కాబోతోంది. అయితే విడుదలకు రెండురోజలు ముందుగా యూనిట్ ప్లస్ కొంతమంది ఆర్జీవీ సన్నిహితుల కోసం రామానాయుడు స్టూడియోస్ లో…

ఈ సమ్మర్ సంచలన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా మరో రోజులో విడుదల కాబోతోంది. అయితే విడుదలకు రెండురోజలు ముందుగా యూనిట్ ప్లస్ కొంతమంది ఆర్జీవీ సన్నిహితుల కోసం రామానాయుడు స్టూడియోస్ లో బుధవారం రాత్రి ప్రీమియర్ ప్రదర్శన ఏర్పాటు చేసారు. చార్మి, పూరి జగన్నాధ్ లాంటి వర్మ సన్నిహితులు ఈ షోకి హాజరయ్యారు. సినిమా చూసిన జనాల అభిప్రాయం ఇలా వుంది.

సినిమా తొలిసగం అంతా లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ ల మీదే వుంది. లక్ష్మీపార్వతి విషయంలో ఏమీ దాచలేదు. తొలిభర్త, సంతానం, ఎన్టీఆర్ కు ఎలా దగ్గరకావడం జరిగింది. వాళ్లిద్దరి మధ్య అమలిన ప్రేమ, బాంధవ్యం ఇవన్నీ ఫక్తు ఫ్యామిలీ సినిమా మాదిరిగా వర్మ చూపించాడట. పాటలు కూడా ఫరవాలేదు అనేట్లు వున్నాయట.

అయితే మలిసగం నుంచి మిగిలిన సినిమా మొత్తం రాజకీయాల చుట్టూనే తిరిగిందని తెలుస్తోంది. డిప్లమాటిక్ గా, అరౌండ్ ది బుష్ మాదిరిగా కాకుండా సినిమా స్టయిట్ గానే చంద్రబాబును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గద్దెదిగడం, జబ్బుపడడం, చనిపోవడం వంటి సీన్లు రియల్ ఎన్టీఆర్ అభిమానులను కాస్త కలవరపెడతాయని చూసినవాళ్లు అంటున్న మాట.

అయితే తొలిసగంతో పోలిస్తే మలిసగం కాస్త డ్రాగ్ అయిందని చూసిన జనాల మాట. మొత్తంమీద వర్మ నుంచి ఈ మధ్యకాలంలో కాస్త మంచి ఔట్ పుట్ నే వచ్చిందని వారు అంటున్నారు. చూడాలి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో?

పవన్ కళ్యాణ్ కొత్తగా రాలేదు.. నాగబాబు హీరో కాదు