Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లవ్ స్టోరీ వాయిదా?

లవ్ స్టోరీ వాయిదా?

కోవిడ్ కలవరం టాలీవుడ్ ను భయపెడుతూంది. సినిమాల పరిస్థితి ఎలావుంటుందో తెలియడం లేదు. అలా అని వకీల్ సాబ్ విడుదలయ్యే వరకు వేచిచూస్తే ముహుర్తం మించిపోతుంది. 

అందుకే చైతూ-సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తయారుచేసిన లవ్ స్టోరీని వాయిదా వేయాలని చూస్తున్నారు. 

ఇప్పటికే సినిమా రెడీ అయిపోయింది. సెన్సారు అయిపోయింది. ఫైన్ ట్యూన్, ఫైన్ కట్ కూడా జరిగిపోయింది. కానీ ఫ్యామిలీలు ఎలా టర్న్ అవుతాయో తెలియడం లేదు. 

రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు నిర్ణయం కోసం బయ్యర్లతో జూమ్ మీటింగ్ పెట్టారు. సగం మంది విడుదల చేసేయమని, సగం మంది వద్దని చెప్పడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. 

హీరో, డైరక్టర్ వాయిదానే బెటర్ అనే ఒపీనియన్ లో వున్నారు. కానీ డేట్ కావాలి. మే ఫస్ట్ వీక్ బెటర్ అనే ఆలోచన ఒకటి వుంది. మరి ఏం చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?