ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు. పార్ట్ వన్ కథానాయకుడు విడుదలయిపోయింది. రెండోభాగం మహానాయకుడు విడుదల కావాల్సి వుంది. టైటిళ్లను బట్టి ఎన్టీఆర్ సినిమా జీవితం, రాజకీయ జీవితం అంటూ విడుదీసారు అని అనుకోవాల్సి వస్తోంది. అయితే రెండోభాగంలో కూడా కుటుంబ వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది.
కేవలం రాజకీయ పార్టీ ప్రకటన తరువాత వ్యవహారాలైన ఎన్నికలు, ప్రచారం, అధికార స్వీకారం మాత్రమే కాదట. బసవతారకం చిన్నతనం, ఎన్టీఆర్ తో అనుబంధం, అలాగే హరికృష్ణ దగ్గర బసవతారకం మాట తీసుకోవడం, ఇలా చాలా వుంటాయని తెలుస్తోంది.
అయితే యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్యే నటించారు కానీ, యంగ్ బసవతారకంగా ఓ వర్థమాన నటి నటిస్తోంది. ఆ అమ్మాయి పేరు గ్రీష్మ. ఇప్పుడు ఈ అమ్మాయి స్టిల్స్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలావుంటే ఫస్ట్ పార్ట్ పై వచ్చిన పరిమిత స్పందన దృష్టిలో పెట్టుకుని, ద్వితీయ భాగంలో చాలా మార్పులు చేర్పులు చేసారని, అందువల్లే ఇంకా షూటింగ్ కార్యక్రమం నడుస్తోందని తెలుస్తోంది.