Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ డైలమా అదేనా?

మహేష్ డైలమా అదేనా?

మహేష్ కు ఇష్టమే. త్రివిక్రమ్ కు అభ్యంతరం లేదు. హారిక హాసిని కూడా హ్యాపీనే. మరి ఎక్కడ సమస్య? సమస్య కాదు. సమస్యలు. రెండు. ఒకటి త్రివిక్రమ్ ఓ సినిమా చేసుకుని రావడానికి ఎన్టీఆర్ ఓకె అనాలి.

అందులోనూ మహేష్ తో సినిమా చేసి రావడానికి. అలవైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సినిమా తన ఖాతాలోకి రాకుండా వేరే హీరో ఖాతాలోకి రావడానికి ఎన్టీఆర్ నే కాదు ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. 

ఇక రెండో సమస్య మహేష్ వైపు. నాగ్ చైతన్యతో సినిమా కు అంతా సిద్దం చేసుకున్న దర్శకుడు పరుశురామ్ ను లాక్కుని వచ్చారు అర్జెంట్ గా. అందుకోసం 14 రీల్స్ ప్లస్ కు వాటా కూడా ఇచ్చారు.

తీరా చేసి అది ఇప్పుడు వెనక్కు పెడితే 2022 సమ్మర్ వరకు పరుశురామ్ అలా కూర్చోవాలి. 2021 పోస్ట్ సమ్మర్ లో త్రివిక్రమ్ సినిమా విడుదలయితే, 2022 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వుంటుంది. అందువల్ల పరుశురాం సినిమా 2022 సమ్మర్ కే. ఇలా చేయడం ఎంత వరకు న్యాయం అన్నది రెండో సమస్య. 

పైగా మహేష్ ఇలా చేస్తే ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా అభిమానుల్లో కావచ్చు ఏమనుకుంటారు? క్రెడిబులిటీ కాస్తయినా దెబ్బతింటుందేమో అన్న అనుమానం. ఇవన్నీ కలిసి త్రివిక్రమ్-మహేష్ సినిమాకు బ్రేకుల్లా తయారయ్యాయి. చూడాలి క్లియర్ అవుతాయో? కావో? 

చంద్రంబావ క‌ళ్ల‌లో ఆనందం కోసం ఆర్కే ఆవేద‌న

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?