Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ఫీలయ్యాడు

మహేష్ ఫీలయ్యాడు

బ్రహ్మోత్సవం పై వచ్చిన టాక్ కన్నా, ఆ సినిమాపై పెట్టకున్న నమ్మకం వమ్మయినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా ఫీలయినట్లు బోగట్టా. నిజానికి బ్రహ్మోత్సవం సినిమాకు డివైడ్ టాక్ వస్తుందని నిర్మాత, హీరో అందరూ సినిమా పూర్తయిన దగ్గర నుంచీ అనుకుంటూనే వస్తున్నారు. తొలిసగం ఫుల్ ఎంటర్ టైనీగా వుంటుందని మలి సగం కాస్త లాగ్ వున్న ఫీల్ గుడ్, మంచి మెసేజ్ వంటి అంశాలు మెల్లగా జనాల్లోకి వెళ్లి, వాళ్లు డైజెస్ట్ చేసుకుంటారని అంచనా వేసారు. 

ఆ సమస్యను, డిఫరెంట్ ప్లస్ ఫ్యామిలీ వాల్యూస్ అనే పబ్లిసిటీ ద్వారా అధిగమించవచ్చు అనుకున్నారు. మంచి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనుకున్నపుడు ఆ మాత్రం రిస్క్ తప్పదు అనుకున్నారు.  అందుకే వీలయినన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసారు.కానీ సినిమాను మరీ ఇలా జనం అస్సలు డైజెస్ట్ చేసుకోనంత టాక్ వస్తుందని ఊహించలేదట. 

శ్రీకాంత్ అడ్డాల కధ కన్నా, అతని ఐడియాలజీ, టేకింగ్ ను నమ్మాడట మహేష్. అందుకే కథ విషయంలో సపోర్ట్ అందిస్తే, మిగిలినది అతను బాగానే చేస్తాడని, పరుచూరి, గణేష్ పాత్రో, శ్రీరమణ (మిధునం) లాంటివాళ్లను తోడు చేసేందుకు ఓకె చేసాడు. కానీ ఇప్పుడు సినిమాను తీయడంలోనే తేడా వచ్చింది. కథ అనేదానికన్నా కథనమే ముఖ్యం అనేదగ్గరే సమస్య వచ్చింది. అదే మహేష్ ను బాధపెడుతోందట.

వన్ విషయంలో ఎలాంటి టాక్ వచ్చినా మహేష్ మంచి ధైర్యం చేసాడు.. మంచి సినమా చేసాడు.. ఇలా అందరూ వైవిధ్యమైన ప్రయత్నాలు చేయాలి వంటి ప్రశంసలు దక్కాయి. కానీ బ్రహ్మోత్సవం విషయంలో మహేష్ పొరపాటు చేసాడు అంటున్నారు కానీ, మంచి ప్రయత్నం చేసాడు అనడం లేదు. అదే బాధపెడుతోందట మహేష్ బాబును. ప్రయత్నించి విఫలమయితే డబ్బులు రాకపోయినా, పేరు వచ్చినా సంతోషం. కానీ ఇక్కడ అదీ రాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?