మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమా డైలాగ్ వెర్షన్ రెడీ అవుతోంది. మరోపక్క హీరోయిన్ వేట కొనసాగుతోంది. సాయిపల్లవిని అనుకున్నారు. డైరక్టర్ అనిల్ రావిపూడి వెళ్లి కథ చెప్పారు. కానీ ఆమె చేయడానికి అంతగా ఇష్టపడలేదు. దాంతో రష్మిక మడోన్నా వైపు చూసారు. ఆమెనే ఫిక్స్ అని అనుకున్నారు. మరోపక్క మహేష్ పక్కన రష్మిక ఏం బాగుంటుంది అన్న ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది. దాంతో ఇప్పుడు వేరే ఆప్షన్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు మహేష్ తో నటించిన హీరోయిన్లు అందరూ ఒక రేంజ్, లుక్ పరంగా కూడా ఓ స్థాయి వున్నవారే. శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, కైరా అద్వానీ ఇలా అందరూ. వీళ్ల సరసన రష్మిక అనేసరికి సినిమా లెవెల్ తగ్గినట్లు వుంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఒకరిద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోనాక్షి సిన్హా పేరు ఇప్పుడు ముందు వరుసలో వున్నట్లు తెలుస్తోంది. సోనాక్షిని టాలీవుడ్ లోకి తేవాలని గతంలో కూడా ట్రయ్ చేసారు. ఆ తరువాత సోనాక్షిని మరిచిపోయారు. ఇప్పుడు ఆమె సన్నబడి నాజూగ్గా తయారుకావడంతో టాలీవుడ్ జనాల చూపు మళ్లీ సోనాక్షి వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
సాయిపల్లవి, రష్మిక మీదుగా సాగే మహేష్ హీరోయిన్ వేట ఇంక ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇదిలావుంటే ఇదే సినిమాలో సీరియస్ గా సాగే ఓ కీలకపాత్ర కోసం అలనాటి హీరోయిన్ విజయశాంతిని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకు విజయశాంతి రీఎంట్రీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నిర్మాతల దగ్గర నుంచి అడ్వాన్స్ అందుకుని అగ్రిమెంట్ కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.