Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ తండ్రి కాబోతున్న తారక్

మళ్లీ తండ్రి కాబోతున్న తారక్

నందమూరి, ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు (సభ్యురాలు) రాబోతున్నారు. ఎన్టీఆర్ మళ్లీ తండ్రి కాబోతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం ఆరునెలల గర్బవతి. మే నెలాఖరుకు ఆమెకు తోమ్మిది నెలలు నిండుతాయి.

ప్రస్తుతం ఈ జంటకు ఓ బాబు వున్నాడు. మళ్లీ బాబో, పాపో రాబోతున్నారు. ఇప్పటి వరకు ఈ విషయం కాస్త గుప్తంగానే వుంచారు. కానీ నిన్న, ఇవ్వాళ సినిమారంగానికి చెందిన జనాలు ఎన్టీఆర్ ఇంటికి వచ్చి వెళ్తుండడంతో ఈ వార్త బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ కూడా అధికారికంగా ప్రకటిస్తారేమో? ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు సినిమాలు కమిట్ అయివున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ సినిమా. అలాగే నెంబర్ వన్ స్టార్ డైరక్టర్ రాజమౌళి సినిమా. ఇలాంటి రెండు శుభాలకు తోడు ఇది మూడో శుభం ఎన్టీఆర్ ఇంట అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?