మారుతి సమర్పించు…మళ్లీ

ఇప్పుడు డైరక్టర్ సుకుమార్ ఇంకా చాలా మంది తమ తమ శిష్యుల్ని డైరక్టర్లుగా పరిచయం చేస్తూ, చిన్న చిన్న సినిమాలకు బ్యానర్ ఇవ్వడం మామూలు అయింది. నిజానికి ఇలాంటి వ్యవహారానికి బీజం వేసింది డైరక్టర్…

ఇప్పుడు డైరక్టర్ సుకుమార్ ఇంకా చాలా మంది తమ తమ శిష్యుల్ని డైరక్టర్లుగా పరిచయం చేస్తూ, చిన్న చిన్న సినిమాలకు బ్యానర్ ఇవ్వడం మామూలు అయింది. నిజానికి ఇలాంటి వ్యవహారానికి బీజం వేసింది డైరక్టర్ మారుతినే. ఆయన గతంలో చాలా సినిమాలను ఇలాగే బ్యానర్ ఇచ్చి అందించారు. కానీ సమస్య ఏమిటంటే వాటిల్లో చాలా వరకు ఫెయిల్యూర్ లే. దాంతో ఆయన తన పేరు అనవసరంగా డామేజ్ అవుతుందని ఈ వ్యవహారానికి స్వస్తి చెప్పేసారు.

అయితే ప్రస్తుతం మారుతి సరైన హీరోతో సరైన ప్రాజెక్టు అన్వేషణలో వున్నారు. సబ్జెక్ట్ లు, లైన్ లు వున్నాయి కానీ ఏ హీరో కూడా ఇప్పట్లో రెడీగా కనిపించడం లేదు. ఇలాంటి టైమ్ లో మారుతి ఓ చిన్న సినిమాను లాగించేయాలని చూస్తున్నట్లు బోగట్టా. అయితే ఆయన కేవలం కథ, మాటలు అందించి సమర్పిస్తారు.

మరో బ్యానర్, మరో డైరక్టర్ సినిమాను తయారుచేస్తారు. మారుతి, బ్యానర్ ఇచ్చిన నిర్మాత, మరో డైరక్టర్ ఇలా ముగ్గురూ లాభాల్లో వాటా తీసుకునే ప్రాతిపదికన సినిమాను నిర్మిస్తారు. ఈసారి మాత్రం మారుతి కాస్త గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాట్లు బోగట్టా.

కేవలం ఎవరో  ఒకరి చేతిలో తన స్క్రిప్ట్ పెట్టేయడం కాకుండా, తన స్క్రిప్ట్ కు న్యాయం చేసే డైరక్టర్ కోసం వెదుకుతున్నారని తెలుస్తోంది. మారుతి స్టయిల్ ఎంటర్ టైన్ మెంట్ అందించే డైరక్టర్ ఎవరు దొరుకుతారో?

ఉద్యాన ఉత్పత్తులతో ‘కిసాన్‌ రైలు’

ఆశలు వదిలేసుకున్నట్టేనా?