Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మొదట కమిట్, తర్వాత Me Too అంటున్నారా?

 మొదట కమిట్, తర్వాత Me Too అంటున్నారా?

తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన ఒక మోడల్ గురించి కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ ఫుట్ బాల్ స్టార్ పై అత్యాచారం ఆరోపణలు చేసింది ఒక మోడల్. ఆమె కోర్టుకు కూడా ఎక్కింది. అయితే ఈ విషయంపై రొనాల్డో ఒకటే మాటే చెబుతున్నాడు. ఆమె ముందుగా కమిట్ అయ్యిందని, తామిద్దరం ఇష్ట పూర్వకంగానే సెక్స్ లో పాల్గొన్నామని.. ఇప్పుడు మాత్రం ఆమె మాట మార్చి అత్యాచారం అని అంటోందనేది రొనాల్డో వాదన.

కోర్టులో రొనాల్డో న్యాయవాది ఇదే వాదనే వినిపిస్తున్నాడు. ఇలాంటి వివాదాలు ఏమీకాదు. ఆ మధ్య వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ విషయంలోనూ ఇదే జరిగింది. అతడిని ప్రభుత్వాలే ఇరికించాయి. ముందస్తుగా అతడితో కమిట్ అయిన ఆడవాళ్లు ఆ తర్వాత అత్యాచారం ఆరోపణలు చేశారు.

ఈ వివాదంతోనే అసాంజ్ కొన్ని సంవత్సరాలుగా యూకేలోని రాయబార కార్యాలయంలో బంధీ అయిపోయాడు. ఆరేడేళ్లుగా అతడు ఆ ఒకే ఇంటికి పరిమితం అయిపోయాడు. బయటకు వస్తే అరెస్టు చేయడానికి బ్రిటన్ పోలీసులు అన్నే సంవత్సరాలుగా బయటకూర్చుని ఉన్నారు.

ఇక బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేస్తున్న అతడి అసిస్టెంట్ వాదనలో కూడా కొంత డొల్ల ఉంది. అదేమిటంటే.. అతడి దగ్గర పనిచేయడానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడే ‘స్వయంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు?’ అనే ప్రశ్నను అడిగాడని ఆమె చెబుతోంది. ఆ తర్వాత తను చేరాక కూడా వేధింపులను కొనసాగించాడని అంటోంది. ఇక్కడ ఆమె చెబుతున్న మాటల్లోనే తేడా ఉంది.

అదేమిటంటే.. ఇంటర్వ్యూ సమయంలోనే అతడు వెకిలి వేషాలు వేశాడని చెబుతున్న ఈమె మళ్లీ అతడి దగ్గర ఎందుకు చేరినట్టు? అనేది ప్రశ్న. అతడి తీరేంటో అక్కడే అర్థమయ్యాకా మళ్లీ అతడి దగ్గరే అసిస్టెంట్ గా చేరాల్సిన అవసరం ఏముంది? అతడి లైంగికంగా వేధిస్తున్నా అతడి దగ్గరే పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఖాయంగా లభించవు.

అప్పుడు అవసరం కొద్దీ చేశానని ఆమె అంటే.. అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? సందడిలో సడేమియా అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు రెచ్చిపోతూ ఉండవచ్చు. కొందరు నిజమైన బాధితులు కూడా ఉండవచ్చు. వీరితో పాటు కమిట్ అయినంత కాలం కమిట్ అయ్యి.. ఇప్పుడు మీ టు అంటున్న వాళ్లకూ కొదవలేకపోవచ్చు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?