మీ-టూ ఉద్యమం నిజంగానే కొందరు హీరోయిన్లకు మేలుచేసింది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో మంచి మనుషులుగా చలామణి అయిన కొందరి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. అయితే ఈ మూమెంట్ లో మరో కోణం కూడా బయటపడింది. మీ-టు ఉద్యమం పేరుతో బ్లాక్ మెయిల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలాంటి ఉదంతమే ఇది.
అందర్నీ షాక్ కు గురిచేస్తూ మీ-టూ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఓ మాజీ హీరోయిన్. టాలీవుడ్ లో ఓ హీరోను బెదిరిస్తోంది. ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోంది. తను కోరినంత డబ్బు ఇవ్వకపోతే గతంలో తమ మధ్య జరిగిన కొన్ని సీక్రెట్ ఎఫైర్లను బయటపెడతానంటూ భయపెడుతోంది.
ఇప్పటికే చాలామంది నటులపై కొంతమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. అయితే వాటికి ఎక్కడా సాక్ష్యాలు లేవు. కోర్టులో వాటిని నిరూపించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే, ఎప్పుడో 10-12 ఏళ్ల కిందటి చేదు అనుభవాలవి. కానీ సదరు నటులు మాత్రం మీడియాలో బ్యాడ్ అయిపోయారు. ఇప్పుడు ఈ హీరో భయం కూడా అదే. ఈ హీరోయిన్ కు కావాల్సింది కూడా ఇదే.
ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి ఇమేజ్, క్రేజ్ తెచ్చుకున్న హీరో అతడు. ఓ పెద్ద హిట్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరో, తర్వాత తనకంటూ ఓ స్టయిల్, డాన్స్ బాగా చేస్తాడనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. పరిశ్రమలో బ్యాకప్ కూడా ఉంది. కానీ ఇలాంటి ఆరోపణలు వస్తే తట్టుకోవడం కష్టం. నిజానిజాలు పక్కనపెడితే మీడియా అంతా పదేపదే అతడ్నే చూపించి బద్నామ్ చేస్తుంది. అదే ఇప్పుడీ హీరో భయం.
పరిశ్రమకు దూరంగా ఉన్న ఆ హీరోయిన్ తో, సదరు హీరోకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఎంతో కొంత మొత్తానికి మేటర్ ను సెటిల్ చేయడం ఖాయం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ హీరో సెటిల్ మెంట్ వరకు వచ్చాడంటే, గతంలో ఆమెతో ఏదో వ్యవహారం నడిపినట్టే కదా. “మీ-టూ”లో ఇదో కొత్త యాంగిల్.