మెగాస్టార్ 150వ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని అందరూ అనుకుంటుంన్నదే. కానీ దీనిపై డిస్కషన్ లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కు సంక్రాంతి కన్నా సమ్మర్ బాగా అచ్చివచ్చిందన్నది ట్రాక్ రికార్డు చూస్తే తెలుస్తుందని, అందువల్ల కాస్త వెనక్కి వెళ్తేనే మంచిదని సూచనలు అందుతున్నాయట.
కొడుకు రామ్ చరణ్ సినిమా ఎలాగూ ఆలస్యమైంది కాబట్టి, దాన్ని మరికాస్త వెనక్కు జరిపి సంక్రాంతి బరిలో దింపితే బెటర్ అని ఆలోచిస్తున్నారట. రెండు సినిమాలకు నిర్మాతలు వేరు, వేరు కానీ, కాంపౌండ్ ఒక్కటే కాబట్టి అనుకుంటే అదేమీ పెద్ద సమస్య కాదు. పైగా సంక్రాంతికి బాలయ్య వందో సినిమా పక్కాగా రెడీ అవుతోంది.
ఎంత కాదన్నా పోలికలు, లెక్కలు, ఇంకా ఇంకా చాలా వుంటాయి. అదీకాక 150 వ సినిమాకు వంద కోట్లు వసూళ్లు సాధిచాలని,కనీసం 70 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. అందువల్ల ఆ రేంజ్ కలెక్షన్లు రావాలంటే సోలోగా సమ్మర్ లో రావడం బెటర్ అని అంటున్నారట. మరి ఏం చేస్తారో చూడాలి.