మనకి ఓ వస్తువు మీద ఇష్టం వున్నపుడు జాగ్రత్తగా దాచుకోవాలి. మనది ఎవడు తీసుకెళ్తాడులే, అంత దమ్ము ఎవరికి వుంది అనుకుంటే ఎవడో ఒకడు వచ్చి ఎగరేసుకుపోతాడు. మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ టైటిల్ వ్యవహారం అలాగే వుంది. ఈ టైటిల్ మీద చాలామంది కన్ను వుంది. ముఖ్యంగా మెగా హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ వాడాలని అనుకున్నట్లు గతంలో వినిపించింది. కానీ అది రామ్ చరణ్ తప్ప మరేవరు వాడకూడదన్నది మెగాస్టార్ మనసులో మాట అని తెలిసి ఆగిపోయాడు.
చిరంజీవి మీద వున్న గౌరవంతోనో, మెగా క్యాంప్ మీద వున్న భయం, భక్తి విశ్వాసాలతోనో, ఆ టైటిల్ ఎవ్వరూ వాడరు అని అనుకున్నారు. అలా వదిలేసారు. కనీసం వెయ్యినో, రెండో వేలో ఫీజు కట్టి రెన్యువల్ చేసుకుంటే సరిపోయేది. దానికి కూడా బద్దకించి వదిలేసారు.
ఇప్పుడేమయింది, నాచురల్ స్టార్ నాని దాన్ని తన సినిమాకు పెట్టేసాడు. సరే, అసలు వాళ్లు మౌనంగా వున్నారు. కానీ కొసరు వాళ్లయిన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. బాయ్ కాట్ గ్యాంగ్ లీడర్ అంటూ హాష్ ట్యాగ్ తగిలించి హడావుడి చేస్తున్నారు.
వాస్తవానికి ఇలా ట్రోలింగ్ వస్తుందని నాని ముందే ఊహించారట. ట్రోలింగ్ వస్తుందేమో అంటే, బిగ్ బాస్ టైమ్ నుంచి అలవాటైపోయింది అని నవ్వి ఊరుకున్నట్లు బోగట్టా. అయినా అంత టైటిల్ మీద అభిమానం, ఆసక్తి వున్నపుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అయినా డబ్బులు కట్టి టైటిల్ ను రక్షిస్తూ వుండాల్సింది. అలా చేయకుండా ధీమాపడితే ఇలాగే వుంటుంది.
అయినా నానికి ఇదేం అలవాటో? కృష్ణార్జున యుద్ధం, దేవ్ దాస్, మజ్ఞు, జెంటిల్ మన్ అంటూ పాత టైటిళ్లు తెచ్చుకుని తగిలించుకోవడం