Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్ గుండు వెనుక గూఢార్ధాలు

మెగాస్టార్ గుండు వెనుక గూఢార్ధాలు

ఓ మనిషి గుండు గీయించుకున్నారు అంటే చాలా కారణాలు వుంటాయి. శుభాలు, అశుభాలు, స్టయిల్, ఇలా చాలా అంటే చాలా వుంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి తొలిసారి క్లీన్ షేవ్ హెడ్ తో కనిపించారు అంటే ఇంకెన్ని అర్థాలు వుంటాయో అని అనుకోవడంలో తప్పు లేదు. ఆయనకు ఆయనే సరదాగా గుండూ బాస్, శివాజీ 2 అంటూ సెల్ఫ్ సెటైర్లు వేసుకున్నారు కూడా.

ఇంతకీ అసలు ఈ గుండు వెనుక ఏమై వుంటుంది వ్యవహారం. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్. అసలు ఇప్పుడు వున్నట్లుండి మెగాస్టార్ గుండు ఎందుకు చేయించుకున్నట్లు? లూసిఫర్ రీమేక్ డైరక్టర్, మెగాస్టార్ సన్నిహితుడు వివి వినాయక్ ఇటీవలే హెయిర్ వీవింగ్ ను తనకు ప్లాన్ చేసుకున్నారు. మరి ఆ వైనం తెలిసి మెగాస్టార్ కూడా అటు వైపు మొగ్గుతున్నారా?

లేదూ, రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ సినిమా ముగించుకురావడానికి ఇంకా కనీసం ఆరు నెలలు అయినా పడుతుంది. అందువల్ల రామ్ చరణ్ వచ్చే వరకు ఆచార్య పూర్తి కాదు. అందువల్ల అప్పటి వరకు ఆచార్య షూటింగ్ జరపడం వల్ల పెద్దగా ఒరిగేది వుండదు. ఇప్పుడు ఇలా గుండు గీయించుకుంటే, మెగాస్టార్ ఎంత విగ్గు పెట్టుకున్నా సెట్ మీదకు వెళ్లడానికి కనీసం రెండు, మూడు నెలలు పడుతుంది. రెండు మూడు నెలల వరకు తాను షూటింగ్ కు వచ్చేది లేదు అని ఆచార్య యూనిట్ కు మెగాస్టార్ ఈ విధంగా ఇండికేషన్ ఇచ్చినట్లా?

ఇదే నిజమైతే దర్శకుడు కొరటాల శివకు షాక్ నే. ఎందుకంటే ఆచార్య ప్రాజెక్టు అలా సాగు...తూ...నే వుంది. 2018 ఏప్రియల్ లో విడుదలయింది భరత్ అనే నేను. ఆ తరువాత నుంచి కొరటాల శివ ఆచార్య ప్రాజెక్టు మీదనే వున్నారు. 2021 ఏప్రియల్ అంటే దాదాపు మూడేళ్లకు అయినా రెడీ అవుతుందా? అన్నది అనుమానమే. ఇప్పుడు మెగాస్టార్ ఎంత విగ్ వాడాలనుకున్నా, కాస్తయినా హెయిర్, సైడ్ లాక్స్ పెరగడం వంటి వ్యవహారాలు వుంటాయి. 

మరి ఇవన్నీ ఆయనకు తెలియనివి కాదు. తెలిసీ ఇలా చేసారు అంటే అయితే హెయిర్ వీవింగ్ ను ట్రయ్ చేయాలని అనుకుని వుండాలి. లేదా ఆచార్యకు కాస్త ఎక్కువ విరామం ఇవ్వాలని అనుకుని వుండాలి. మొత్తానికి ఇదంతా చూస్తుంటే కొరటాల శివ 2021లో కూడా ఆచార్య సినిమా మీదనే వుండేలా వుంది వ్యవహారం. 

ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్ గ్యాసిప్ ఏమిటంటే, కొరటాల శివ ఆచార్య తరువాత రామ్ చరణ్ తో సినిమా చేస్తారని గతంలో వార్తలు వినిపించాయి. కానీ అలా చేయకుండా బన్నీ చెంతకు వెళ్లిపోయారు. ఆ కోపం కూడా కాస్త మెగాస్టార్ మనసులో వుందని, అందుకే అన్నీ కలిసి వచ్చేలా ఆచార్య ప్రాజెక్టు మీద అస్సలు తొందర పడడం లేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

బాబుగారి దళిత రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?