cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్ మెగాస్టార్ నే

మెగాస్టార్  మెగాస్టార్ నే

కరోనా వ్యాప్తి తరువాత యంగ్ టాప్ హీరోలు బయట ఎక్కడన్నా కనిపించారా? మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ ఇలా చాలా మంది అల వైకుంఠపురములో, ఆమూల సౌంధంబులో అన్నట్లు ఇళ్లకే పరిమితం అయిపోయారు.  బాలయ్య ఆసుపత్రి కార్యక్రమాల్లో మాత్రం ఒకటి రెండు సార్లు కనిపించారు.  నాగ్ బిగ్ బాస్ కు మాత్రం ఓ ప్రోమో షూట్ చేసారని వార్తలు వచ్చాయి. నాగ్ అస్సలు జాడ లేదు. వెంకీ అయితే సమస్యేలేదు.  ప్రభాస్ తన స్వంత పని మీద ఆర్జీవో ఆఫీస్ కు వచ్చి వెళ్లారు. మోహన్ బాబు అయితే ఫుల్ రెస్ట్ మోడ్ లో వున్నారు. 

కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం వీరందరికీ భిన్నం. కరోనా వ్యాప్తి బాగా వుందని తెలిసినా, ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహించడానికి స్వయంగా పోలీస్ కమిషనరేట్ కు వెళ్లారు. వెళ్లడమే కాదు, తన స్టాఫ్ లో కరోనా వచ్చి తగ్గిన వారిని తీసుకెవెళ్లి, ప్లాస్మా డొనేషన్ చేయించారు. 

నిజానికి ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా వెళ్లకపోయినా ఓకె.  ఓ బైట్ ఇచ్చినా చల్తా. కానీ అలా చేయకుండా ఆయన స్వయంగా వచ్చి, సరాదాగా మాట్లాడి వెళ్లడం అంటే ఆయన రూటే సెపరేట్ అనుకోవాలి.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?

 


×