Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్‌ సినిమా ఆలస్యం ఎందుకంటే.!

మెగాస్టార్‌ సినిమా ఆలస్యం ఎందుకంటే.!

మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న 150వ సినిమా ఎప్పుడొస్తుందా.? అని మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికే మీనమేషాల్లెక్కెడుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఇప్పటికే ఫస్టాఫ్‌ ఇలా వుంటుందని చిరంజీవికి వివరించగా, సెకెండాఫ్‌పై ఇంకా స్పష్టత లేదు. సెకెండాఫ్‌ గురించే ఎదురుచూస్తున్నామని ఈ చిత్రాన్ని నిర్మించనున్న రామ్‌చరణ్‌ వెల్లడించాడు. 

'సినిమాకి కథ ముఖ్యం. ఫస్టాఫ్‌ పూరి జగన్నాథ్‌ వినిపించారు. అది నాన్నకి నచ్చింది. సెకెండాఫ్‌ కూడా ఓకే అయితే సినిమాని ప్రారంభిస్తాం. ఖచ్చితంగా ఈ చిత్రానికి పూరి జగన్నాథే దర్శకుడు. కథ వల్లే ఆలస్యమవుతోంది..' అంటూ రామ్‌చరణ్‌, మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న 150వ సినిమాపై స్పష్టత ఇచ్చాడు. 

ఇక, పవన్‌కళ్యాణ్‌ నిర్మాతగా తాను హీరోగా నటించనున్న సినిమా 2015 మొదటి భాగంలో వుండొచ్చని రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'గబ్బర్‌సింగ్‌ 2' తర్వాతే ఆయన నిర్మాతగా, తాను హీరోగా సినిమా సెట్స్‌పైకి వస్తుందని అంటున్నాడు రామ్‌చరణ్‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?