Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు?

మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు?

ఉన్నట్లుండి ఓ మాంచి గ్యాసిప్ గుప్పుమంటోంది. త్రివిక్రమ్ డైరక్షన్ లో ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటిస్తారన్నదే ఆ గ్యాసిప్. అయితే ఇది వట్టి గ్యాసిప్ నా? నిజమా? అన్నది క్లారిటీ లేదు. 

ప్రస్తుతానికి గ్యాసిప్ గా చలామణీ అయితే అయిపోతోంది. బొమ్మన్ ఇరానీ, జగపతి బాబు, సముద్రఖని, మురళీశర్మ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను విలక్షణ పాత్రల్లో చూపించిన త్రివిక్రమ్ మళ్లీ అదే పాట్రన్ లోనే మహేష్ సినిమాలో ఓపాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఆ పాత్రకు మోహన్ బాబును అడిగారని, ఇంకా అటు నుంచి రెస్పాన్స్ రావాల్సి వుందని టాక్. 

ప్రతి సినిమాలో మాదిరిగానే ఇద్దరు హీరోయిన్లు,  వైవిధ్యమైన క్యారెక్టర్ యాక్టర్, ఓ బలమైన విలన్ అనే ప్యాట్రన్ లో ఈసారి కూడా త్రివిక్రమ్ కథ తయారుచేసుకుంటున్న అనిపిస్తోంది వినవస్తున్న గ్యాసిప్ లు అన్నీ లైన్ లో పెడితే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?