Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హాట్ సినిమాల రుచి మ‌రిగిన రాజుగారు!

హాట్ సినిమాల రుచి మ‌రిగిన రాజుగారు!

ఒక‌ప్పుడు టాలీవుడ్ షో మ్యాన్ అనేంత స్థాయిలో వ‌ర‌స విజ‌యాల‌ను న‌మోదు చేసిన నిర్మాత ఎంఎస్ రాజు. ప‌క్కా కుటుంబ క‌థా చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశారీయ‌న‌. కేవ‌లం నిర్మాత‌గా డ‌బ్బు పెట్ట‌డ‌మే కాకుండా, సినిమా మేకింగ్ లో కూడా త‌న వంతు పాత్ర‌ను పోషించ‌డం, వీలైతే అలా తెర మీద మెరిశారు కూడా. ఒక్క‌డు, వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా... ఎంఎస్ రాజు కు తిరుగులేద‌నే భావ‌న క‌లిగించిన సినిమాలు.

అయితే 'వాన‌' సినిమాతో క‌థ అడ్డం తిరిగింది. భారీ అంచ‌నాల మ‌ధ్య‌న వ‌చ్చిన వాన తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత సిద్ధార్థ్ తో మ్యాజిక్ రిపీట్ చేసే ప్ర‌య‌త్నంలో వచ్చిన 'ఆట', త‌న‌యుడిని ప‌రిచ‌యం చేస్తూ  రాజు నిర్మించిన 'తూనీగ తూనీగ' ఆయ‌న‌ను వెన‌క్కు  నెట్టేశాయి. కొంత విరామం త‌ప్ప‌లేదు.

ఇటీవ‌లే డ‌ర్టీ హ‌రీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎంఎస్ రాజు ఆ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా  బూతుమ‌యం అంటూ క్రిటిక్స్ దుమ్మెత్తి పోసినా.. క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ఆ సినిమా స‌క్సెస్ అయ్యింది. ఏదోలా మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన ఎంఎస్ రాజు హాట్ బాట‌నే ఎంచుకున్న‌ట్టుగా ఉన్నారు.  

తాజాగా ఆయ‌న అనౌన్స్ చేసిన సినిమా టైటిల్ లోనే వేడి పుట్టిస్తోంది. '7డేస్ 6 నైట్స్' అట ఆ సినిమా పేరు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం డ‌ర్టీ హ‌రీ పేరును వాడుతున్నారు ఎంఎస్ రాజు. ఇది న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ అని, డ‌ర్టీ హ‌రీని మించి ఉంటుందంటున్నారు! మొత్తానికి హాట్ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టిన ఎంఎస్ రాజు, ఆ సినిమాల రుచి మ‌రిగి.. అదే రూట్లో సాగుతున్న‌ట్టున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?