Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగశౌర్య... టైటిల్స్ ను ఎందుకు పాడు చేస్తావో!

 నాగశౌర్య... టైటిల్స్ ను ఎందుకు పాడు చేస్తావో!

హీరో గే తరహా లక్షణాలున్న వాడిగా నటిస్తాడట.. అందుకోసమని 'నర్తనశాల' టైటిల్ ను వాడేశారు. తెలుగులో క్లాసిక్ సినిమాల టైటిల్స్ తో కంగాళీ సినిమాలు రావడం కొత్త ఏమీ కాదు. వరుణ్ సందేశ్ హీరోగా 'లవకుశ' అంటూ ఏదో బూతు సినిమా వచ్చినట్టుంది. ఆ పై కోన వెంకట్ అండ్ కంపెనీ 'శంకరాభరణం' అంటూ ఒక భోజ్ పురి లెవల్ సినిమా తీశారు.

ఇక అలా క్లాసిక్ టైటిల్స్ ను కంగాళీగా మార్చే క్రమంలో నాగశౌర్య 'నర్తనశాల' అంటూ ఒక సినిమాను వదిలాడు. ఆ సినిమాను జనాలు పూర్తిగా తిరస్కరించి పంపారు. అయినా తీరు మారినట్టుగా లేదు.  ఇప్పుడు మరో క్లాసిక్ టైటిల్ ను వాడుతున్నాడట. అదే 'మూగమనసులు'. బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ టైటిల్ ను ఈ సారి ఎంతటి కంగాళీగా మారుస్తారో చూడాల్సి ఉంది.

పాత సినిమాల టైటిల్ ను వాడుకోవడం ఒక మార్కెటింగ్ టెక్నిక్ గా మారింది.  ఆ టైటిల్స్ కు వీళ్లు న్యాయం చేయలేరని స్పష్టం అవుతూనే ఉంది. దానికి తోడు.. కంగాళీ సినిమాలకు క్లాసిక్ టైటిల్స్ పెట్టి.. మరింత విమర్శల పాలవుతూ ఉన్నారు.

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?