Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టక్ జగదీష్‌ని ఎలర్ట్ చేసిన ‘వి’

టక్ జగదీష్‌ని ఎలర్ట్ చేసిన ‘వి’

‘వి’ అమెజాన్‌లో విడుదల కాబోతోందని హడావుడి చేసినంత సమయం పట్టలేదు... సినిమాలో ఏమీ లేదని ప్రేక్షకులు పెదవి విరవడానికి. నాని కిల్లర్ పాత్ర పోషించిన ఈ చిత్రం రొటీన్‌కి భిన్నంగా వుంటుందని ఆశిస్తే, సగటు రివెంజ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరచింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదలై తప్పించుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గరయితే భారీ ఫెయిల్యూర్‌ని చవిచూసి వుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

దీంతో నాని అప్రమత్తమయ్యాడట. తన తదుపరి చిత్రం ‘టక్ జగదీష్’ విషయంలో మార్పుచేర్పులు ఇప్పుడే చేసుకునేలా జాగ్రత్త పడుతున్నాడట. 

నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ని కూడా పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నాడట. 

‘వి’లో అసలు ఎంటర్‌టైన్‌మెంట్ లేదని, నాని మార్కు కామెడీ టైమింగ్ మిస్ అయ్యామనే ఫీడ్‌బ్యాక్‌తో టక్ జగదీష్‌లో అది తక్కువ కాకుండా చూసుకుంటున్నారట.

ఎలాగో సినిమా విడుదలయ్యేది వచ్చే ఏడాదిలోనే కనుక అవసరమయితే కొంత భాగం రీషూట్ చేయడానికి కూడా ఓకే అనుకుంటున్నారట. ఈ లాక్‌డౌన్ గట్రా లేకపోయినట్టయితే ‘వి’ మార్చిలో, ‘టక్ జగదీష్’ జూన్‌లో రిలీజ్ అయ్యేవి. 

ఇప్పుడు మార్పుచేర్పులకు సమయం దొరకడంతో దానిని టీమ్ యూజ్ చేసుకుంటోంది. అలాగే నాని తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ స్క్రిప్ట్ కూడా రీవిజిట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

కేసిఆర్ అడ్డాపై కన్ను

సినిమా మొత్తం న‌వ్వుతూనే ఉంటారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?