Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని-పూరి-వాటే జోక్ ?

నాని-పూరి-వాటే జోక్ ?

హీరో నాని ఓ సినిమాను దర్శకుడు పూరి జగన్నాధ్ తో చేయబోతున్నారా? ఈ మేరకు ఓ గ్యాసిప్ గుప్పుమంది. ప్రతి హీరో ఆచి తూచి లైనప్ లు సెట్ చేసుకుంటున్న సమయం ఇది. పైగా నాని ఓ ప్రాజెక్ట్ ఓకె చేయడం అంటే చాలా జాగ్రత్తలు చూస్తాడు. అలాంటిది ఫేడవుట్ అయిపోయాడని అందరూ అనుకుంటున్న డైరక్టర్ పూరి జగన్నాధ్ తో నాని సినిమా ఓకే చేస్తాడా?

అసలు ఇంతకీ ఇప్పుడు నాని లైనప్ ఏమిటి? ప్రస్తుతం నాని ఓ సినిమాను నాగ్ కాంబినేషన్ తో మల్టీస్టారర్ గా చేస్తున్నాడు. దాని తరువాత ఇటీవల ప్రకటించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘జెర్సీ’ సినిమా చేస్తాడు. క్రికెట్ నేపథ్యంలోని ఈ సినిమా కాగానే దిల్ రాజు బ్యానర్ కు షిఫ్ట్ అవుతాడు. ఆ బ్యానర్ లో ఇప్పటికే ఓకే చేసిన కథతో, కొత్త డైరక్టర్ తో సినిమా చేస్తాడు.

ఆ తరువాత అవకాశం కుదిరితే త్రివిక్రమ్ తో మళ్లీ హారిక బ్యానర్ లో సినిమా చేస్తాడు. లేదూ అంటే ఇంద్రగంటితో సినిమా ఆలోచన కూడా వుంది. ఈ మధ్యలో పూరి జగన్నాధ్ ఎక్కడ కనిపించడం లేదు. నాని యూనిట్ జనాలు కూడా అలాంటి ఆలోచనే లేదని క్లారిటీగా చెబుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?