Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని సరసన కీర్తి సురేష్ ?

నాని సరసన కీర్తి సురేష్ ?

నాని – కీర్తి సురేష్ జంట ఇప్పటికే ఓ హిట్ కొట్టారు. నేను లోకల్ సినిమాలో కలిసి నటించిన నాని-కీర్తి సురేష్ మళ్లీ మరోసారి కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నయి. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఇప్పుడు ప్రతి తెలుగు ఇంటికీ పరిచయం అయిపోయింది. అందుకే ఆమెను తమ ప్రాజెక్టులోకి తీసుకురావడానికి హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.

మళ్లీ రావా వంటి డిఫరెంట్ సినిమా అందించిన గౌతమ్ డైరక్టర్ గా నాని హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో, పాతికేళ్ల కిందటి కథాకాలంతో ఈ సినిమా కథకు దర్శకుడు రూపకల్పన చేసారు. ఇక్కడ ప్రస్తుతమో, అప్రస్తుతమో కానీ, శర్వా-నిత్యమీనన్ ల మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో కాస్త మెచ్యూర్డ్ లవ్ స్టోరీగానే కనిపిస్తుంది.

ఆ సంగతి అలా వుంచితే, నాని-గౌతమ్ ల ప్రాజెక్టుకు జెర్సీ అని డిఫరెంట్ పేరు పెట్టిన సంగతి ఇప్పటికే వెల్లడయింది. ఈ సినిమాలోకి హీరోయిన్ గా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని, దర్శకుడు, హీరో ఏకాభిప్రాయానికి వచ్చారు. దాంతో ఆమె డేట్ ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాతలతో కీర్తి సురేష్ ఓ సినిమా చేసింది. పవన్ హీరోగా నిర్మించిన అజ్ఞాతవాసిలో కీర్తి నటించింది. ఇప్పడు నాని సినిమాకు కూడా ఓకె అంటే ఇది రెండో సినిమా అవుతుంది.

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న కీర్తి కి తెలుగులో ఏ సినిమా లేదు. అందువల్ల ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం కాస్త ఎక్కువగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?