హిట్ సినిమాకు ఎలాగైనా కలెక్షన్లు వస్తాయి. యావరేజ్ సినిమాను హిట్ సినిమాగా మార్చడంలోనే హీరో స్టామినా తెలుస్తుంది. హీరో నానికి వున్న ఫ్యామిలీ ఇమేజ్ ఇప్పుడు క్లియర్ గా తెలిసింది. కృష్ణార్జున 'యుద్దం', దేవదాస్, అంటూ మాస్ సినిమాలు చేస్తే నానిని జనం చూడరని క్లారిటీ వచ్చింది. అదే గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టినా, ఫ్యామిలీ సినిమా చేస్తే చూస్తారని తెలిసింది.
నాని సినిమా, విక్రమ్ కుమార్ డైరక్టర్, పోస్టర్ నిండా మహిళలే. అందులోనూ సీనియర్ హీరోయిన్ లక్ష్మి, మిడిల్ ఏజ్డ్ హీరోయిన్ శరణ్య, కొత్త అమ్మాయిలు ఇద్దరు. దాంతో ఫ్యామిలీలు ముందుగానే డిసైడ్ అయిపోయినట్లున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమా ఎలా వున్నా ఓసారి చూసేయాలని. ఆ ప్రభావం సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్ల మీద క్లియర్ గా కనిపించింది.
సమీక్షలు ఎలావున్నా, రేటింగ్ లు ఎలావున్నా, నానీస్ గ్యాంగ్ లీడర్ కు ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు వచ్చాయి. నిర్మాతలు మైత్రీమూవీస్ ఊపిరి పీల్చుకునేలా చేసాయి. ఒకటి రెండు ఏరియాలు మినహా మిగిలిన ఏరియాలు అన్నీ ఫస్ట్ వీక్ లో దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చే సూచనలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
తొలి వీకెండ్ కలెక్షన్లు ఇలా వున్నాయి. బ్రాకెట్ లో సేల్ ఫ్రయిస్.
నైజాం…………………4.67 ..(7.60)
సీడెడ్………………….1.43 ..(3.60)
ఉత్తరాంధ్ర………….1.57 ..(2.50)
ఈస్ట్…………………….1.06 ..(1.60)
వెస్ట్……………………..0.64 ..(1.20)
కృష్ణ……………………..0.94 ..(1.45)
గుంటూరు……………..1.10 ..(1.80)
నెల్లూరు……………….. 0.35..(0.75)