Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

న‌య‌న‌తారనే టాప్.. రికార్డు స్థాయి రెమ్యూనిరేష‌న్!

న‌య‌న‌తారనే టాప్.. రికార్డు స్థాయి రెమ్యూనిరేష‌న్!

వివాదాలెన్ని వెంటాడుతున్నా.. విమ‌ర్శ‌ల సంగ‌తెలా ఉన్నా.. త‌న కెరీర్ లో మాత్రం అన్ స్టాప‌బుల్ గా దూసుకుపోతోంది న‌టి న‌య‌న‌తార‌. హీరోయిన్ గా కెరీర్ మొద‌లుపెట్టి దాదాపు 18 యేళ్ల‌ను పూర్తి చేసుకున్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా పెద్ద పెద్ద ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది న‌య‌న‌తార‌. 

త‌మిళంతో తెరంగేట్రం చేసి.. ఎన్నాళ్లుగానో బాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను క‌లిగి ఉన్నా.. వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా, చివ‌ర‌కు పెళ్లి చేసుకున్న త‌ర్వాత బాలీవుడ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది న‌య‌న‌తార‌.

న‌య‌న‌తార త‌నే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమాల‌కు కూడా సౌత్ లో గిరాకీ ఇంకా త‌గ్గ‌లేదు. పెద్ద హీరోల సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రోవైపు సోలోగా స‌త్తా చూపుతోంది ఈ హీరోయిన్. ఈ క్ర‌మంలో రికార్డు స్థాయి పారితోషికం కూడా ఈమెకు ద‌క్కుతోంద‌ని స‌మాచారం. 

న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళంలో రూపొందుతున్న ఒక సినిమాకు పొందే పారితోషికం ప‌ది కోట్ల రూపాయ‌లు అని ఇండ‌స్ట్రీ టాక్! సౌత్ లో ఏ హీరోయిన్ అయినా అందుకునే రికార్డు స్థాయి మొత్తం అవుతుంది ఇది!

ఈ విష‌యంలో న‌య‌న‌తార‌కు క‌నీసం పోటీ ఇచ్చే సౌత్ హీరోయిన్ కూడా ఎవ్వ‌రూ లేన‌ట్టే! బాలీవుడ్ లో ప‌ది కోట్ల‌ను అందుకునే హీరోయిన్లు ఉన్నారు కానీ, సౌత్ లో ఇది రేర్ ఫీట్. ఇప్పుడు న‌య‌న‌తార‌కు అది సాధ్యం అవుతోంద‌ని స‌మాచారం.

ఇలా రికార్డు స్థాయి పారితోషికం ఊపులో న‌య‌న‌తార 75 సినిమాల‌ను పూర్తి చేసుకుంటోంది! ఈ రోజుల్లో ఇన్ని సినిమాల్లో హీరోయిన్ గా న‌టించ‌డం కూడా మాట‌లేమీ కాదు! న‌య‌న‌తార ఇప్పుడే ఇంకా బాలీవుడ్ ప్ర‌యాణాన్ని కూడా మొద‌లుపెట్టింది. వివాహం త‌ర్వాత కూడా న‌టిస్తుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. దీంతో.. ఆమె స్టార్ గానే వంద సినిమాల‌ను పూర్తి చేసుకునే అవ‌కాశాలూ క‌నిపిస్తున్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?