cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిఖిల్ పెళ్లి రేపే

నిఖిల్ పెళ్లి రేపే

హీరో నిఖిల్ పెళ్లి కి మళ్లీ మహుర్తం సెట్ అయింది. కరోనా కారణంగా నిఖిల్ పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోలం ముగిసాక చేసుకుందా అనుకున్నాడు. కానీ మూఢం, మంచి రోజులు లేకపోవడంతో నిర్ణయం మార్చుకుని అర్జెంట్ గా చేసేసుకుంటున్నాడు. నగర శివార్లలోని ఓ ఫామ్ హవుస్ లో పెళ్లి జరగబోతోంది.

ఈ రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు. అలాగే పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం కూడా ఈ సాయంత్రం వుంటుంది. డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇరు వైపు వాళ్లు వారి ప్రేమను అంగీకరించారు కూడా. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇరువైపులకు చెందిన అతి కొద్ది మందితో వివాహ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

అందుకు ముందుగా ఎవరి ఇళ్లలో వాళ్లు సాంప్రదాయ బద్దమైన కార్యక్రమాలు అతి తక్కువ మందితో నిర్వహించుునేలా ప్లాన్ చేసారు.