Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మాత మాట వినని దిల్ రాజు?

నిర్మాత మాట వినని దిల్ రాజు?

సినిమా రంగంలో చిన్న చిన్న ఇగో క్లాష్ లు అన్నవి కామన్. ఒక్కోసారి ఇవే పెద్దవిగా మారి వాళ్ల కెరీర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి. ఆ మధ్య ఓ సినిమాటోగ్రాఫర్ తో ఓ పెద్ద నిర్మాతకు అంతగా పొసగలేదుట. ఎక్కడో ఏదో తేడా వచ్చింది. అయితే అక్కడితో అది అయిపోతే బాగానే వుండేది. 

కానీ ఆ నిర్మాత కాస్త పంతానికి వెళ్లి,  ఒకరిద్దరు పెద్ద నిర్మాతలకు ఫోన్ లు చేసి, ఆ సినిమాటోగ్రాఫర్ ను వాళ్ల సినిమాలకు ఎంగేజ్ చేయవద్దని కోరినట్లు బోగట్టా. ఇలా చెప్పిన వాళ్లలో నిర్మాత దిల్ రాజు కూడా వున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ వర్క్ ముఖ్యం. పని వచ్చి, ఆటిట్యూడ్ బాగుంటే, ఇలాంటి సలహాలు పెద్దగా పట్టించుకోరు. అందుకే నిర్మాత దిల్ రాజు కూడా ఈ సలహా పెడచెవిన పెట్టి, ఆ సినిమాటోగ్రాఫర్ ను తన సినిమాకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఆ సినిమాటోగ్రాఫర్ తో పెద్దగా ఆటిట్యూడ్ సమస్య ఏమీ లేదు. మరి ఆ పెద్ద నిర్మాతకు అతనికి ఎందుకు తేడా వచ్చిందో, వేరేవాళ్లకు పోన్ లు చేసి మరీ తీసుకోవద్దని చెప్పే వరకు ఎందుకు వెళ్లిందో. అయినా మరో పెద్ద సినిమా చాన్స్ చేతిలోకి వచ్చింది అంటే ఆ సినమాటోగ్రాఫర్ దగ్గర ఇంతో అంతో సరుకు వుండే వుండాలి కదా?

విశాఖ‌కే అన్ని కావాలంటున్న విజ‌య‌సాయిరెడ్డి! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?