Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్-వర్మ సినిమా.. ఎక్కడో తేడా కొడుతోంది

నాగ్-వర్మ సినిమా.. ఎక్కడో తేడా కొడుతోంది

కొన్ని సినిమాలంతే. హైప్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కదు. పైపెచ్చు రివర్స్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు నాగార్జున-ఆర్జీవీ సినిమాది కూడా ఇదే బాపతు. ఈ సినిమాకు లాంఛింగ్ రోజున ఉన్నంత క్రేజ్ ప్రస్తుతం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

జీఎస్టీ అంటూ రామ్ గోపాల్ వర్మ పక్కదారులు తొక్కడం, సినిమాకు సంబంధించిన స్టిల్స్ లో ఎలాంటి ఆసక్తి లేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన లోపాలు. దీనికి తోడు తాజాగా విడుదలచేసిన మరో 2 స్టిల్స్, మరీ నాసిరకంగా ఉండడం కూడా అభిమానుల్ని ఆవేదనకు గురిచేస్తోంది.

నాగ్-వర్మ కాంబోలో వస్తున్న ఈ నాలుగో సినిమాకు సంబంధించి నిన్న 2 స్టిల్స్ రిలీజ్ చేశారు. మన్మధుడిగా పేరుతెచ్చుకున్న నాగార్జున, ఆ స్టిల్స్ లో ఏమాత్రం ఆకర్షణీయంగా లేడు. పోనీ యాక్షన్ సినిమా కదా సర్దుకుపోదాం అనుకుంటే కనీసం ఆ ఛాయలు కూడా లేకుండా చేశాడు వర్మ. నల్ల నెక్-టీషర్ట్ వేసుకున్న నాగార్జున ముసలి పోలీసాఫీసర్ లా కనిపించాడు తప్ప, యాంగ్రీ యంగ్ మేన్ లా, పవర్ ఫుల్ పోలీస్ లా అస్సలు కనిపించ లేదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. మ్యాగ్జిమమ్ యాక్షన్ పార్ట్ అక్కడే పూర్తిచేయాలనేది ప్లాన్. మార్చి నాటికి షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తిచేసి, ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాను వదలాలని అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?