cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

'నోటా' పక్కా పొలిటికల్ థ్రిల్లర్

'నోటా' పక్కా పొలిటికల్ థ్రిల్లర్

విజయ్ దేవరకొండ తరువాత సినిమా 'నోటా' ట్రయిలర్ వచ్చేసింది. తమిళ సినిమా మేకర్లు ఏ విధంగా అయితే భారీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేస్తారో? మన దగ్గర టాప్ హీరోల సినిమాల కథ స్పాన్ ఏ రేంజ్ లో వుంటుందో, ఆ స్థాయిలో వుంది వ్యవహారం అంతా. ట్రయిలర్ చూస్తుంటే ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది. 

ఇంకొక్కడు పేరుతో విక్రమ్ తో తెలుగులో డబ్ అయిన సినిమా, ఆరమ్ నంబి ఫేరుతో తమిళంలో విక్రమ్ ఫ్రభుతో తీసిన సినిమా ఖాతాలో వున్న డైరక్టర్ ఆనంద్ శంకర్ అందిస్తున్న సినిమా నోటా. వర్తమాన రాజకీయాలు, తమిళరాజకీయాలు మేళవించి కథ తయారుచేసుకున్నట్లు కనిపిస్తోంది.

చూస్తుంటే.. ఏక్ దిన్ కా సుల్తాన్ మాదిరిగా డమ్మీ సిఎమ్ గా వచ్చి హీరో విజయ్ దేవరకొండ రాజకీయ చదరంగంలో చిక్కుకునే పాత్రను పోషించినట్లు కనిపిస్తోంది. సినిమా కథ స్పాన్, నిర్మాణ విలువలు, కాస్టింగ్ అన్నీ చూస్తుంటే ఓ భారీ కథనే తీసుకున్నట్లు క్లారిటీ వస్తోంది.

బహుశా ఈ రేంజ్ స్పాన్ వున్న స్టోరీలో విజయ్ చేయడం ఇదే తొలిసారి. ఇది కనుక హిట్ అయితే మన నిర్మాతలు కూడా విజయ్ తో భారీ సినిమాలు ప్లాన్ చేసే ధైర్యం వస్తుంది. ఇప్పటి వరకు యూత్, ఫ్యామిలీ అంటూ మీడియం బడ్జెట్ లోనే వుంచారు విజయ్ ను.