cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ కలెక్షన్స్.. మరో దుమారం అవుతుందా!

ఎన్టీఆర్ కలెక్షన్స్.. మరో దుమారం అవుతుందా!

విడుదల అయ్యి రెండు రోజులు అయిపోయిన నేపథ్యంలో.. ఎన్టీఆర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది సగటు ప్రేక్షకుడిలో ఉండే క్యూరియాసిటీ. ఈ విషయంలో రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఎన్టీఆర్ బయోపిక్ ను కేవలం సినిమాగా చూడలేని పరిస్థితి ప్రేక్షకుల్లో ఉంది. ఇది రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీశారు అనేది బహిరంగ సత్యం. ఎన్టీఆర్ ను దించేసిన వాళ్లే ఆయన మహనీయుడు అని మళ్లీ సినిమా తీశారనేది వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని విషయం. అందుకే ఈ సినిమా విషయంలో రకరకాల కామెంట్లు వినిపించడానికి అక్కడే అవకాశం ఏర్పడింది.

అయితే ఒక సినిమాగా చూస్తే.. ఎన్టీఆర్ మీద భారీగానే ఇన్వెస్ట్ చేశారు. ఈ సినిమా రెండు పార్ట్స్ మేకింగ్ ఖర్చు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల మధ్యన ఉంది. మరి ఆ మేరకు ఈ సినిమా వసూళ్లను రాబట్టుకోవాల్సి ఉంది. ఇక తమ సినిమా తొలిరోజున 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ఎన్టీఆర్ మూవీమేకర్లు అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేశారు.

ఇక ట్రేడ్ వర్గాల్లో మాత్రం వేరే రకమైన మాట వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 10 కోట్ల రూపాయల మొత్తాన్ని, రెండోరోజున ఐదుకోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందనే టాక్ కూడా సోషల్ మీడియా నుంచి వినిపిస్తోంది.

మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్ కూడా సోషల్ మీడియాలు దుమారమైన చర్చలనే రేపేట్టుగా ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ సూపర్ హిట్.. ఈ సినిమా కూడా చరిత్రను సృష్టించినట్టే అని బాలయ్య ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో మరో సందేహం లేదు. దానిపై జనాలు ఎలా రియాక్ట్ అవుతారనేదే ప్రశ్న!

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?