Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ స్థాయిని బాలయ్య అంతలా తగ్గించేశాడా!

ఎన్టీఆర్ స్థాయిని బాలయ్య అంతలా తగ్గించేశాడా!

ఇప్పటివరకూ చాలా బయోపిక్ ల మీద రియల్ ఈవెంట్స్ మీద వచ్చిన సినిమాలపై బాగా వినిపించిన మాట.. ‘ఓవర్ హైప్ చేశారు...” అనేది. చాలా బయోపిక్స్ విషయంలో ఇదేమాట వినిపించింది. మణిరత్నం ‘నాయకుడు” సినిమాను చూసి వరదరాజ మొదలియార్ ‘నేను మరీ అంత మంచోడిని కాదు...’ అన్నాడట. బోలెడన్ని వార్, రియల్ ఈవెంట్స్ సినిమాల విషయంలో... హాలీవుడ్ లో వచ్చే సినిమా విషయంలో కూడా ఓవర్ హైప్ చేశారు అనే విమర్శ వచ్చింది. ‘ఆర్గో’ అనే హాలీవుడ్ థ్రిల్లర్ ను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు.

ఇరాన్ లో చిక్కుకున్న అమెరికన్ అధికారులను అక్కడ నుంచి తీసుకురావడం అనే వాస్తవ మిషన్ మీద ఆ సినిమాను తీశారు. ఆస్కార్ అవార్డు పొందింది ఆ సినిమా. కథంతా నిజమేకానీ.. వాస్తవంలో మరీ అంత థ్రిల్లింగ్ ఏమీలేదని ఆ కథలో వాస్తవ పాత్రధారులే వ్యాఖ్యానించారు.

ఇలానే ఉంటుంది. బయోపిక్స్, రియల్ ఈవెంట్స్ విషయం అంతా. కొన్నాళ్ల కిందట బాలీవుడ్ లో వచ్చిన బాగ్ మిల్కా బాగ్.. తదితర సినిమాలు కూడా ఆ కోవకే చెందుతాయి. వాస్తవానికి మించి ఆయా వ్యక్తుల స్థాయిని చూపించారు.. అనేది బాగా వినిపించిన విమర్శ.

అయితే వాటన్నింటికీ భిన్నంగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అసలు వ్యక్తి స్థాయిని బాగా తగ్గించేశారనే కామెంట్ వినిపిస్తోంది! అంటే ఎన్టీఆర్ ప్రతిభను.. ఆయన నటనా పటిమను.. తగ్గించేశారు అంటున్నారు చాలామంది. 'ఎన్టీఆర్ ఇలా నటించేవాడా.. ఈ మాత్రం దానికే గొప్పనటుడు అయ్యాడా..' అని సోషల్ మీడియాలో కొన్ని నిజాయితీతో కూడిన కామెంట్లే వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ గొప్పనటుడు అని చెప్పాలంటే.. ఆయన స్థాయిలో నటించి చూపించాల్సింది బయోపిక్ లో. బాలయ్యను ఎన్టీఆర్ స్థాయి నటుడు అంటే అది అసంబద్ధంగానే ఉంటుంది. ఎన్టీఆర్ కు సినీవారసుడే కానీ.. ఎన్టీఆర్ చేసిన పాత్రలను పండించడం అంటే మాటలుకాదు.

ఇక బ్లాక్ అండ్ వైట్ లో ఉండే సినిమాల అందం.. కొత్తగా సెట్స్ వేసి పండించడం కూడా కుదిరే పనికాదు. ఎంత ఖర్చుపెట్టినా.. ఒరిజినల్స్ ను చూసిన జనాలకు ఈ కొత్త సెట్టింగులు ఆనవు! నర్తనశాలలో బృహన్నల పాత్రను బాలయ్య తన సినిమాలో పెట్టాడు.

అయితే అదే నర్తనశాల క్లైమాక్స్ లో అర్జునుడుగా ఎన్టీఆర్ ఎంత అందంగా కనిపిస్తాడో ఆయన అభిమానులకే గాక  తెలుగు ప్రేక్షకులకు కూడా చెప్పనక్కర్లేదు. అందుకే బాలయ్య అలా కనిపించే సాహసం కూడా చేయలేదు.

ఏవో కొన్ని పాత్రలను అయితే చేశాడు కానీ.. ఎన్టీఆర్ ను ఆల్రెడీ అలా చూశాకా.. ఇప్పుడు బాలయ్యను అలా చూడటం మాత్రం.. ఏదో సూపర్ హిట్ సినిమాకు, దృశ్యకావ్యం లాంటి సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తే అందులో ప్రేక్షకుడి తప్పేంలేదు!

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?