Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్-కొరటాల..ప్రకటన రేపే?

ఎన్టీఆర్-కొరటాల..ప్రకటన రేపే?

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ప్రకటన రాబోతోంది. త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ అయిందని గ్రేట్ ఆంధ్ర ముందే బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. 

అలాగే కొరటాలతో సినిమా వుండబోతోందని వెల్లడించాం. ఇప్పుడు ఆ సినిమా ప్రకటన రాబోతోంది. ఉగాది సందర్భంగా సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఈ మేరకు ప్రకటన రాబోతోంది.

కొరటాల స్నేహితుడు సుధాకర్ స్వంత బ్యానర్ అయిన యువ సుధ తో కలిసి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భాగస్వామ్యంలో ఈ సినిమాను నిర్మిస్తారు. ఆచార్య బాధ్యతల నుంచి కొరటాల, ఆర్ఆర్ఆర్ బాధ్యతల నుంచి ఎన్టీఆర్ బయటకు రాగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. 

ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో కొరటాల రెడీగా వున్నారు. ఈ కథలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటీ? ఈసారి కొరటాల చెప్పబోతున్న మెసేజ్ ఏంటీ అన్న వివరాలు ఒక్కొక్కటీ గ్రేట్ ఆంధ్రలో ఎక్స్ క్లూజివ్ గా ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే వుంటాం..అంత వరకు ఇంతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?