సరైన డైరక్టర్ కోసం వెదుకులాడుతున్నాడు ఎన్టీఆర్. ఇక్కడ సమస్య ఏమిటంటే డైరక్టర్ మాత్రమే కాదు, మళ్లీ డెభై కోట్ల కలెక్షన్లు తేగలిగిన డైరక్టర్ కావాలి. అక్కడే సమస్య వస్తోంది. అలాంటి డైరక్టర్ ఎవరూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. చుట్టూ తిరుగుతున్న ఒకరిద్దరికి ఆ స్టామినా లేదు. కాస్త నమ్మకాలు తక్కువ. బోయపాటి చూస్తే లాక్ అయి కూర్చున్నాడు.
ఇక ఎన్టీఆర్ ప్రేమగా వినయన్న అని పిల్చుకునే వివి వినాయక్ అయితే ఎలా వుంటుంది అన్న డిస్కషన్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వినాయక్ డిసెంబర్ తో ఫ్రీ అవుతున్నారు. చిరంజీవి 150 వ సినిమా జనవరి విడుదలకు రెడీ అవుతోంది. అంటే ఆ మేరకు ఖాళీ అవుతారు.
వినాయక్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఆరేడేళ్లయిపోతోంది. పైగా అఖిల్, యోగి లాంటి ఒకటి రెండు తప్ప, వినాయక్ సినిమాలకు కాస్త మినిమమ్ గ్యారంటీ వుంటుంది. పైగా ఎన్టీఆర్ అంటే వినాయక్ కు అభిమానం కూడాను. అందువల్ల ఈ కాంబినేషన్ అయితే ఎలా వుంటుంది అన్న డిస్కషన్లు నడుస్తున్నట్లు వినికిడి.