Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరంజీవి పార్టీపై పెద్ద ఎన్టీఆర్ ఏమన్నాడు?

చిరంజీవి పార్టీపై పెద్ద ఎన్టీఆర్ ఏమన్నాడు?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. చిరంజీవి రాజకీయానికి తెర పడిందని చెప్పాలి. మెగాస్టార్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి వచ్చే వరకూ వదలని ఈ ఫ్యాన్స్.. తీరా తమ హీరోలు రాజకీయాల్లో ఎదుర్కొనే అవమానాలను సహించలేక వీళ్లు రాజకీయాలను వదిలేస్తేనే మేలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.

చిరంజీవి రాజకీయానికి శుభం కార్డు పడటం ఆయన ఫ్యాన్స్‌కు ఎంతో కొంత ఊరటనిస్తోంది. ఈ సంగతిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ 2008లో జరిగినా, అంతకు ముందు నుంచినే ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. 2004ఎన్నికల తర్వాత చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ఊపు వచ్చింది.

తెలంగాణ విభజన జరుగుతుంది.. ఆంధ్రలో ఇంద్ర పార్టీ ఏర్పడుతుందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది. వైఎస్ సీఎంగా ఉండటంతో పచ్చ పత్రికలు ఇలాంటి వార్తలు రాయసాగాయి. అయితే తెలంగాణ విడిపోలేదు కానీ, ఏపీలో ఇంద్ర పార్టీ రావడం.. ఫెయిల్యూర్ కావడం జరిగింది. అయితే 2004ముందు నుంచి కూడా చిరంజీవి రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించిన ఊహాగానాలున్నాయి.

అవి 1994నాటికే పీక్స్‌కు చేరిన వైనాన్ని ఒక సీనియర్ జర్నలిస్టు తాజాగా ఓక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో వివరించడం ఆసక్తిదాయకంగా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన ఆ సీనియర్ జర్నలిస్టు చిరంజీవి సినిమాలకు ఊపు తెచ్చేందుకు పొలిటికల్ ఎంట్రీ అనే ప్రచారాన్ని తెచ్చేవారని చెప్పాడు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు వచ్చాయన్నారు.

అల్లు అరవింద్ అలాంటి ప్రకటనలు చేసేవాడని.. ఆ సీనియర్ జర్నలిస్టు పేర్కొన్నాడు. సరిగ్గా చిరంజీవి సినిమాల విడుదల సమయంలోనే ఈ హడావుడి జరిగేదన్నాడు. ఒకసారి అమెరికాలోని తెలుగు వారి సంఘమొకటి పిలిస్తే అటు ఎన్టీఆర్, ఇటు చిరంజీవి ఇద్దరూ న్యూయార్క్ వెళ్లారని, ఆ సమయంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి అక్కడి తెలుగువారు అడుగగా, ఆలోచిస్తాను.. అని మెగాస్టార్ సమాచారం ఇచ్చాడని ఆ సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు.

అప్పుడు అమెరికా వెళ్లిన వారిలో తను కూడా ఉన్నానని.. ఆ సమయంలో ఎన్టీఆర్, చిరంజీవిల సమావేశం కూడా జరిగిందని పేర్కొన్నాడు. ఆ సమావేశం అనంతరం.. ఎన్టీఆర్ తో తను మాట్లాడాను అని, చిరు పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగినట్టుగా పేర్కొన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘అబ్బే.. నేను ఉన్నంత వరకూ చిరంజీవి పార్టీ పెట్టను అన్నాడు. నాకు ఆ విషయాన్ని చెప్పాడు. వారు నాకు ఫ్యాన్..’’ అని అన్నాడట.

అప్పటికి ఉదయం పత్రికకు రిపోర్టర్ అయిన తను ఇదే విషయాన్ని బ్యానర్ స్టోరీగా ఇచ్చానని చిరంజీవికి కొంత కోపం కూడా వచ్చి ఉండవచ్చని, ఇండియాకు వచ్చాకా చాన్నాళ్ల పాటు ఆయనకు కనిపించకుండా ఉన్నానని చివరకు చిరంజీవే పిలిపించాడని.. ఎన్టీఆర్ చెప్పడం వల్లనే తను ఆ కథనాన్ని రాసినట్టుగా చిరుకు చెప్పానని.. ఆయన కూడా నవ్వేశాడని ఆ జర్నలిస్టు వివరించాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?