Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ 'రేడియేషన్'

ఎన్టీఆర్ 'రేడియేషన్'

తొండదరపడి ముందే కూసినట్లు, మైత్రీ మూవీస్ మెల్లగా తాము ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా గురించి లీక్ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ బర్త్ డే అభినందనల్లో భాగంగా, త్వరలో రేడియేషన్ సూట్ లో కలుసుకుందాం అని చెప్పారు.  దానికి ప్రశాంత్ నీల్ కూడా అంతే నర్మగర్బంగా బదులు ఇచ్చారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కు ప్రశాంత్ చెప్పిన లైన్, దాని టైటిల్ అదే నంట. రేడియేషన్ అన్నది టైటిల్ అంటున్నాయి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు.  కానీ ఈ ప్రాజెక్టు అప్పుడే కాదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కు కేజిఎఫ్ నిర్మాతలతో మరో సినిమా కమిట్ మెంట్ వుంది. అందులో భాగంగా కేజిఎఫ్ 2 తరువాత ఓ చిన్న కన్నడ ప్రాజెక్టును చేస్తారని తెలుస్తోంది. ఈగ తరువాత రాజమౌళి మర్యాదరామన్న మాదిరిగా అన్నమాట. ఆ తరువాత తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తారు. అంటే దాదాపు 2022 నాటికి ఎన్టీఆర్ సినిమా వుండొచ్చు.

దానయ్య కష్టం ఫలించలేదా?

అడ్వాన్స్ లు ఇవ్వడంలో నిర్మాత దానయ్య ను మించిన వారు లేరు. ఎప్పుడో ముందు చూపుతో మనీ విత్తనాలు జల్లి, సినిమాలు సంపాదించడం ఆయనకు వచ్చిన విద్య. దానినే తరువాత వచ్చిన మైత్రీ మూవీస్ కూడా ఫాలో అవుతోంది. అయితే ఇప్పుడు ఈ రెండు సంస్థలు కూడా ఒకే డైరక్టర్ కోసం పోటీ పడ్డాయి. 

అతనే కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్.  ఈయన తరవాత ప్రాజెక్టు కోసం ముందుగా ప్రయత్నాలు ప్రారంభించింది. తరువాత దానయ్య స్టార్ట్ చేసారు. ఒక దశలో దానయ్య బంగళూరుకు కాస్త ఎక్కువ సార్లే వెళ్లి వచ్చారు. కానీ ఇప్పుడు మైత్రీ-ప్రశాంత్ నీల్ ల ట్వీట్ లు చూస్తుంటే దానయ్య కష్టం ఫలించనట్లే కనిపిస్తోంది.పాపం అప్పటికీ బోొలెడు ఖర్చు చేసి కన్నడ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు కూడా ఇచ్చారు.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?