Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్-త్రివిక్రమ్ అఫిషియల్ ప్రకటన

ఎన్టీఆర్-త్రివిక్రమ్ అఫిషియల్ ప్రకటన

మొత్తానికి ఎన్టీఆర్ అభిమానుల చిరకాల కోరిక..త్రివిక్రమ్ డైరక్షన్ లో హీరో నటించాలని. 2017 సెప్టెంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కిస్తున్నట్లు నిర్మాణ సంస్థ హారిక హాసిని అధికారికంగా ఫ్రకటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో  కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా  ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. 2017 సెప్టెంబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు.

ప్రస్తుతం ఆ సంస్థ నిర్మించే పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే ఎన్టీఆర్ డైరక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేసే ముందుగా బాబీతో ఓక సినిమా ఫినిష్ చేస్తారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?