Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం, మహానటి

పాపం, మహానటి

మహానటి. అలనాటి మేటి హీరోయిన్ సావిత్రి బయోపిక్. ఈ సినిమాను ఓ మాంచి క్లాసిక్ గా తీయాలని, చూసే ప్రేక్షకులకు సర్ప్రయిజ్ గా వుండాలని నిర్మాత స్వప్నదత్ తదితరుల కోరిక. అందుకే ఈ సినిమా విశేషాలను వీలయినంతలో ప్రొఫైల్ లో వుంచుతూ వస్తున్నారు.

కానీ ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ లీక్ చేసేస్తున్నారు. తెలుగులో మీడియాతో బంధాలున్న టెక్నీషియన్ ఒకరు ఆ సినిమాకు పనిచేస్తూ, లీకులు ఇస్తున్నారని గుసగుసలు వున్నాయి. సరే, ఆ లైన్ ను అరికట్టే ప్రయత్నం చేస్తే, ఎక్కడో ఎవరో ఒకరు ట్విట్టర్ లో ఏదో ఒక ఫొటో షేర్ చేస్తున్నారు. ఒరిజినల్ నో తెలియదు ఫేక్ నో తెలియదు.

మొన్నటికి మొన్న సావిత్రి, జెమిని గణేషన్ లుక్ అంటూ ఓ బ్లాక్ అండ్ వైట్ ఫిక్ బయటకు వచ్చింది. అది చూసిన వారికి సినిమా మీద క్రేజ్ సగానికి పడిపోయింది. సావిత్రి ఏమిటి? ఆ ముక్కు ఏమిటి? జెమిని ఏమిటి? ఆ మీసం ఏమిటి? అని కామెంట్లు వినిపించాయి. అదంతా అయిందనుకుంటే, ఇప్పుడు సమంత మరికొన్ని లీకులు ఇచ్చింది.

సమంత ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర చిత్రీకరణ అయిపోయింది. ఈ సందర్భంగా ఆమె నేషనల్ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడింది. తాను జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నా అని, ఆ పాత్రనే సావిత్రి కథను సినిమాలో నెరేట్ చేస్తుందని చెప్పేసింది. దాంతో సమంత క్యారెక్టర్ మీద ఓ క్లారిటీ వచ్చేసింది. సినిమా స్క్రీన్ ప్లే మీద ఓ క్లారిటీ వచ్చేసింది.

ఓ జర్నలిస్ట్ మహానటి కథను రాయడం లేదా నెరేట్ చేయడం అనే స్టయిల్ లో కథ సాగుతుందన్నమాట. అయితే సమంత ఆ క్యారెక్టర్ వేస్తోంది కాబట్టి, కథ మధ్యమధ్యలో అసలు కథకు పాజ్ ఇచ్చి, ఆమెను అలా అలా చూపిస్తుంటారన్నమాట. 

ఇలా ఒక్కో విషయం బయటకు వచ్చేస్తుంటే, మహానటి విడుదల నాటికి సినిమా మొత్తం బయటే వుంటుందేమో? అసలే సినిమా వాయిదాపడి, వెనక్కు వెళ్లింది. దీనికితోడు ఇలా విషయాలు అన్నీ బయటకు వస్తే, జనాలకు ఆసక్తి మాట అలా వుంచితే బయ్యర్ల పరిస్థితి ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?