Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ కు రోజుకు కోటిన్నర?

పవన్ కు రోజుకు కోటిన్నర?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో అయిదు సినిమాలు వున్నాయి. అఫీషియల్ గా ప్రకటించినవి మూడు. నిర్మాతలు ప్రకటించినవి మరో రెండు. ఇన్ని వుండగా మరో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. ఎందుకు? వకీల్ సాబ్ ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. కరోనా కారణంగా క్రిష్ డైరక్షన్ లోని సినిమా వెనుక పడింది. అందుకే పవన్ స్వంత మేనల్లుడుతో సినిమా ప్లాన్ చేసి అటు వెళ్లారు క్రిష్. దాంతో ఇప్పుడు ఓ నెలా రెండు నెలలు గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది.

ఈ టైమ్ లో మామూలుగా అయితే ఏం చేస్తారు? దాని తరువాత చేయాల్సిన సినిమాను ఒక షెడ్యూలు అయినా ఫినిష్ చేస్తారు. కానీ పవన్ అలా కాకుండా ఆ నెల, నెలన్నర రోజులను వేరే కొత్త సినిమాకు వాడాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు? సింపుల్..అదనపు ఆదాయం వస్తుంది కాబట్టి. ఎలా?

క్రిష్ సినిమా ఆలస్యం అవుతుందని హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేస్తే పవన్ కు ఇప్పుడు రూపాయి రాదు. ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ వుండనే వుంది. కావాలంటే సినిమా ఓ దరికి చేరాక మిగిలిన అమౌంట్ వస్తుంది. అలా కాకుండా ఆ సినిమాను అలాగే వుంచి, అయ్యప్పన్ కోషియమ్ ను ఒకె చేస్తే, మహా అయితే పవన్ ముఫై నుంచి ముఫై అయిదు రోజులు డేట్ లు ఇస్తే చాలు ఆ సినిమాకు. అది సింపుల్ గా రీమేక్ అయ్యే సినిమా కదా.

ఇలా చేస్తే ఓ కొత్త సినిమాకు సరిపడా రెమ్యూనిరేషన్ వస్తుంది. ఎలా లేదన్నా యాభై కోట్లు రెమ్యూనిరేషన్ వుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా. అంటే ముఫై నుంచి ముఫై అయిదు రోజులు లైన్ లో వున్న సినిమాను పక్కన పెట్టి కొత్త సినిమాకు ఇస్తే రోజుకు ఎలా లేదన్నా కోటి నుంచి కోటిన్నర అందుకోవచ్చు. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లు ఎక్కడికి వెళ్తారు. ఎప్పుడు చేస్తే అప్పుడే చేయించుకుంటారు. అదీ విషయం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?