Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌.. ఈ పని అప్పుడే చేయొచ్చుగా.?

పవన్‌.. ఈ పని అప్పుడే చేయొచ్చుగా.?

పవన్‌కళ్యాణ్‌ 'కాటమరాయుడు' సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళింది. షూటింగ్‌ మొదలైంది.. పవన్‌కళ్యాణ్‌ కూడా షూటింగ్‌కి హాజరవుతున్నాడు. 'సెట్స్‌లో వుండగా తీసిన స్టిల్‌..' అంటూ ఓ పొటో ఇప్పుడు వెలుగుచూసింది. ఇదే 'కాటమరాయుడు' లుక్‌ అన్న ప్రచారం జరుగుతోంది. 

నిజానికి 'కాటమరాయుడు' ఫస్ట్‌ లుక్‌తో పోల్చితే ఇది వెయ్యి రెట్లు బెటర్‌. పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజుకి, చిత్ర యూనిట్‌ తరఫున విషెస్‌ చెప్పేయాలన్న ఆదుర్దాలో, ఏదో ఒక ఫొటో రిలీజ్‌ చేసేశారు టైటిల్‌ పెట్టేసి. దాంతో, అప్పట్లో అదో పెద్ద ఫెయిల్యూర్‌ అటెంప్ట్‌లా మారిపోయింది. 'పవన్‌కళ్యాణ్‌ని అవమానించారు..' అని సాక్షాత్తూ పవన్‌కళ్యాణ్‌ అభిమానులే ఫీలయ్యారు కూడా. 

బెంగళూరుకి వెళ్ళి స్లిమ్‌గా తయారై, మాంఛి గ్లోతో తిరిగొచ్చి, సెట్స్‌లో హుషారుగా కన్పిస్తున్నాడట. అందరికీ తెల్సిన విషయమే కదా, 'కాటమరాయుడు' తమిళ 'వీరం'కి ఫ్రీమేక్‌ అని. 'దాన్నుంచి స్ఫూర్తి పొందడం' అంటే ఫ్రీమేక్‌ అనే అనుకోవాలి. అబ్బే, అదేం లేదు.. అని ఇంతవరకు 'కాటమరాయుడు' టీమ్‌ కొట్టి పారేయలేదు గనుక, ఇది ఫ్రీమేక్‌ అని ఫిక్సయిపోవచ్చు. 

ఏదిఏమైతేనేం, పవన్‌కళ్యాణ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ అయితే బయటకు వచ్చింది. ఫిక్సయిపోవచ్చా.? లేదంటే, ఇదీ పాత స్టిల్స్‌లోంచి తీసిందే.. అని కొన్ని రోజుల తర్వాత అసలు విషయం వెలుగు చూస్తుందా.? తన సినిమా విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకునే పవన్‌కళ్యాణ్‌ కూడా ఫస్ట్‌ లుక్‌ విషయంలో ఎందుకంత నిర్లక్ష్యంగా వున్నట్లు.? పైన వున్న స్టిల్‌ని ఫస్ట్‌ లుక్‌లా రిలీజ్‌ చేసి వున్నా, ఆ కిక్‌ ఇంకోలా ఉండేదేమో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?