పవన్ కళ్యాణ్ కావూరి హిల్స్ లో 130 కోట్లతో ఇల్లు కొన్నారు. ఇదీ పొలిటకల్ క్రిటిక్ కత్తి మహేష్ ఫేస్ బుక్ పోస్ట్. అయితే ఈ విషయంలో ఒక క్లారిటీ పవన్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏడాది క్రితం పవన్ ఓ ఇంటిని కావూరి హిల్స్ ప్రాంతంలోని నీరూస్ షోరూమ్ వెనుక కట్టించుకున్న మాట వాస్తవం. పవన్ సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే ఈ విషయంలో కాస్త పర్యవేక్షణ కూడా సాగించినట్లు బోగట్టా.
గత ఏడాది చివరిలోనో, కాస్త అటు ఇటుగానో ఆ ఇల్లు పూర్తయింది. ఫ్లాట్ లో వుండే పవన్ ఆ ఇంట్లోకి మారారు. ఆ ఇల్లు 800 గజాలకు కాస్త అటు ఇటుగా వుంటుందని తెలుస్తోంది. దాదాపు 30 కోట్ల ఖర్చయినట్లు బోగట్టా. ప్రస్తుతానికి అయితే పవన్ కట్టుకున్న ఇల్లు అయితే ఇదే అని, 130 కోట్లు అన్నది గ్యాసిప్ మాత్రమే అని పవన్ వర్గాలు చెబుతున్నాయి.
నీరూస్ వెనుక కట్టుకున్న ఇల్లు కూడా మరీ అద్భుతంగా ఏమీకాదని, జస్ట్ మామూలుగానే వుంటుందని తెలుస్తోంది. మరి 130 కోట్ల విలువైన ఇల్లునో? అందుకు తగిన స్థలమో కావూరి హిల్స్ లో ఎక్కడ వుందో, కత్తి మహేష్ నే వెల్లడించాల్సి వుంది.
జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!