పవన్ కు ఎందుకు నో చెబుతున్నారు?

కృష్ణ, బాలయ్య, చిరంజీవి, వెంకీ, రాజశేఖర్, ఇలా అందరూ అన్న పాత్రను, ఇద్దరో ముగ్గురో తమ్ముళ్లున్న ఇంటి పెద్ద పాత్రను పోషించిన వారే. వీళ్లందరి సినిమాల్లో తమ్ముళ్లుగా ఆయా సినిమాల సీజన్ లో కాస్త…

కృష్ణ, బాలయ్య, చిరంజీవి, వెంకీ, రాజశేఖర్, ఇలా అందరూ అన్న పాత్రను, ఇద్దరో ముగ్గురో తమ్ముళ్లున్న ఇంటి పెద్ద పాత్రను పోషించిన వారే. వీళ్లందరి సినిమాల్లో తమ్ముళ్లుగా ఆయా సినిమాల సీజన్ లో కాస్త పాపులర్ అయిన నటులే నటించారు. అప్పుడెప్పుడూ సమస్య రాలేదు. కానీ పాపం, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి సమస్య ఎదురవుతోంది. సరైన ఆర్టిస్టులు దొరకడం లేదు. పవన్ రేంజ్ కు, సినిమా రేంజ్ కు సరిపడే ‘తమ్ముళ్లు’ దొరకడం లేదు. సీనియర్ హీరోలకు హీరోయిన్ల సమస్య వుందనుకుంటే, ఇదో కొత్త సమస్య. 

నిజానికి పవన్ హీరోగా చేస్తున్న సినిమాలో తమ్ముడి క్యారెక్టర్ చేయమంటే, ఏ అప్ కమింగ్ లేదా, యంగ్ హీరో అయినా ఎగిరి గంతేస్తారు. కానీ అలా జరగడం లేదు. పైకి చెప్పకున్నా, ఒప్పుకోకున్నా, దాదాపు అందరు యంగ్ హీరోలు ఏదో ఓ సాకు చెప్పి తప్పించుకున్నట్లు  తెలుస్తోంది. అలా అని టాలీవుడ్ ఏమన్నా గొడ్డు పోయిందా అంటే అదీ లేదు. ఇక్కడున్నంత మంది యంగ్ హీరోలు మరే ఇతర భాషా సినిమా రంగంలోనూ లేరు. కానీ పవన్ కు సరైన ఫేస్ లు దొరకడం లేదు.

రాజ్ తరుణ్,  విజయ్ దేవరకొండ, నాగశౌర్య ఇలాంటి రేంజ్ హీరోలు కావాలి. దీనివల్ల సినిమాకు కాస్త మల్టీ స్టారర్ లుక్ వస్తుంది. సినిమాకు ప్లస్ అవుతుంది. కానీ ఎవరూ దొరకడం లేదు. ఎందుకని? ఎందుకు నో అంటున్నారు? ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ సినిమా అంటే యంగ్ హీరోలు జంకేస్తున్నారని తెలుస్తోంది. 

దీనికి కారణం, ఆ సినిమాలో నటించినా తమకు సరైన ప్రాధాన్యత ఉండకపోవచ్చన్నది ఒకటి. సినిమా ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పవన్ సినిమా షెడ్యూళ్లు ఆయన మూడ్ ను బట్టి వుంటాయి. అప్పుటికప్పుడు రమ్మని చెబితే వెళ్లితే చేస్తున్న సినిమాలకు ఇబ్బంది. వెళ్లకపోతే మరో తలకాయనొప్పి. అలాంటివి కొరి తెచ్చుకునే కన్నా, తప్పించుకోవడం బెటర్. ఇదే ఆలోచనతో పాపులర్ యంగ్ హీరోలు తప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

అయినా సాయిధరమ్, వరుణ్ తేజ, ఇద్దరు యంగ్ హీరోలు తమ దగ్గరే వున్నారు కదా? వీళ్లనెందుకు ట్రయ్ చేయడం లేదో? వాళ్లయితే సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోతుంది కదా? వీళ్లయితే రెమ్యూనిరేషన్ మూడు కోట్ల రేంజ్ లో వుంటుంది. అదే  మిగిలిన హీరోలయితే కొటిలోపుతో కానిచ్చేయచ్చనేమో?

ఆఖరికి అన్ నోన్ ఫేస్ లే పవన్ తమ్ముళ్లుగా సెట్ అయ్యేలా వుంది.