Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ ఒకేసారి మూడు సినిమాలు?

పవన్ ఒకేసారి మూడు సినిమాలు?

ఏఎమ్ రత్నం నిర్మాతగా పవన్ హీరోగా నిర్మించే సినిమాకు ముహుర్తం చేసేసారు. ఎప్పడో తీయబోయే సినిమాకు ఇప్పుడు ముహుర్తం ఏమిటా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ తన స్వంత బ్యానర్ లాంటి శరద్ మురార్ సినిమా చేస్తున్నారు. మరో పక్క హారిక హాసిని తో త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు నవంబర్ లో 15 రోజులు కేటాయించేసారు కూడా.

డాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటే తన సినిమా కూడా చేస్తానని మాటివ్వబట్టే త్రివిక్రమ్, పాపం బన్నీ సినిమాకు దూరం అయ్యారు. అందుకే ఆ విధంగా నవంబర్ లో 15 రోజులు డేట్లు కేటాయించారని వినికిడి. అంటే ఇటు టాలీ సినిమా, అటు త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వున్న నేపథ్యంలో హడావుడిగా ఎఎమ్ రత్నం సినిమాకు పూజ ఎందుకు చేసినట్లో?  అన్న డౌట్లు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఇదే బ్యానర్ తో గోపీచంద్ హీరోగా స్టార్ట్ చేసిన ఆక్సిజన్ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆ సినిమా బిజినెస్ పూర్తి చేసుకునేందుకు వీలుగానే పవన్ తన సినిమా పూజ చేసుకునేందుకు అంగీకరించారని టాక్ వినిపిస్తోంది. డాలీ సినిమా కొంత వరకు వచ్చాక, త్రివిక్రమ్ సినిమాకు డేట్లు ఇచ్చినట్లే, ఆ సినిమా కొంత జరిగాక, ఎఎమ్ రత్నం సినిమాకు డేట్లు ఇస్తారని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?