Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ తో నయనతార-థమన్?

పవన్ తో నయనతార-థమన్?

పవన్ తన సినిమాల విషయంలో కాస్త స్పీడ్ గానే వున్నట్లు కనిపిస్తోంది. డాలీ డైరక్షన్ లోని ఓన్ ప్రొడక్షన్ చకచకా ఫినిష్ అవుతోంది. ఇదే సమయంలో నవంబర్ లో 15 రోజుల పాటు త్రివిక్రమ్-హారిక హాసిని సినిమాకు కేటాయించారు.  ఆ తరువాత కూడా పవన్ లేని సీన్లను చకచకా ఫినిష్ చేసుకోవడానికి షెడ్యూళ్ల ప్లాన్ చేస్తున్నారు. 

అంటే డాలీ సినిమా ఫినిష్ అయ్యేసరికి త్రివిక్రమ్ సినిమా కూడా చాలా వరకు ఫినిష్ చేయాలన్నది సంకల్పం. అలాగే ఇటీవల ఎ ఎమ్ రత్నం సినిమాకు పూజ చేసారు. ఈ సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ అయింది. కానీ ఇప్పుడే సెట్ మీదకు వెళ్లదు. త్రివిక్రమ్ సినిమా ఫినిషింగ్ స్టేజ్ కు రావాలి. 

అయితే ఈ సినిమాకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసే పనిలో నిర్మాత రత్నం వున్నారని టాక్ వినిపిస్తోంది. ఎస్ ఎస్ థమన్ ను ఈ సినిమాకు మ్యూజిక్ డైక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారని గుసగుస వినిపిస్తోంది. అలాగే నయనతారను పవన్ పక్కన నటింపచేయాలని అనుకుంటున్నారట. మరి పవన్ గ్రీన్ సిగ్నల్ లేకుండా ఇలా ఏర్పాట్లు జరుగుతాయంటారా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?