Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పెద్ద అల్లుడి ప్రయారిటీ అంతేనా?

పెద్ద అల్లుడి ప్రయారిటీ అంతేనా?

ఎన్టీఆర్ చిన్న అల్లుడు చంద్రబాబు క్యారెక్టర్ కు రానాను తీసుకున్నారు. అప్పుడే షూట్ కూడా చేసేస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవ విగ్రహంలో చంద్రబాబు పోలికలు వున్నాయని అప్పట్లో జనం అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. భల్లాలదేవ క్యారెక్టర్ లో కనిపించిన రానా ఇప్పుడు చంద్రబాబుగా కనిపించబోతున్నారు. సో ఓ అల్లుడి క్యారెక్టర్ ఓకె.

మరి కీలకమైన మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఎవరు ధరిస్తారు? నిజానికి ఎన్టీఆర్ జీవితంలోకి చంద్రబాబు కన్నా ముందే దగ్గుబాటి వచ్చారు. ఎన్టీఆర్ తో సినిమా నిర్మించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ వున్నారు. అప్పట్లో దేశం కార్యకర్తలందరికీ డాక్టర్ గారు గా ఆయన బాగా పరిచయం. చివరి రోజుల్లో కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన తరువాత కూడా దగ్గుబాటి మామగారితోనే వున్నారు. మరి అలాంటి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఎవరు ధరిస్తారు? రానా మాదిరిగా క్రేజ్ వున్న హీరో ఎవరైనా వస్తారా?

కానీ ఇవేవీకాదని తేలిపోయింది. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే నటుడు భరత్ రెడ్డిని దగ్గుబాటి పాత్రకు తీసుకున్నారు. భరత్ రెడ్డి మంచి నటుడే కావచ్చు. దగ్గుబాటి ఫీచర్లకు సరిపోయే ఫేస్ కావచ్చు. కానీ చంద్రబాబు పాత్రకు ఫేస్ సరిపోయిందని చిన్న నటుడిని కానీ, కొత్త వారిని కానీ తీసుకుంటే ఎలా వుంటుంది? దగ్గుబాటి కోసం అలా తీసుకున్నా, అలాగే వుంటుంది.

ఇదంతా చూస్తుంటే దగ్గుబాటి పాత్రకు ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ పాటి ప్రాధాన్యత వుంటుందో అర్థం అయిపోతోంది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ ను తెరవెనుక నుంచి చంద్రబాబు డైరక్ట్ చేస్తున్నారన్న విమర్శలు కూడా నిజమని నమ్మాల్సి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?