Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పెళ్లికి సమంత కండిషన్ అదేనా?

పెళ్లి విషయంలో దేనికైనా ఓకె కానీ, ఒక్కటే కోరిక లేదా కండిషన్ అని సమంత వైపు నుంచి నాగ్ కు ఎదురైనట్లు తెలుస్తోంది. అదేంటంటే, పెళ్లి చర్చిలో ముందుగా జరగాలి అన్నదే. ఆ తరువాత కావాలంటే హిందూ సంప్రదాయం ప్రకారమో, లేదా రిసెప్షన్ నో ఇంకేదైనా ఓకె అని, కానీ ముందుగా చర్చిలో తమ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగాలని సమంత కోరినట్లు తెలుస్తోంది. 

అందుకే నాగ్ తన కొడుకు నాగ చైతన్య పెళ్లికి చెన్నయ్ ను వెన్యూగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సమంత తల్లితండ్రులు తమ సంప్రదాయ పద్దతుల్లో, తమకు అలవాటైన చర్చిలో తమ కుమార్తె పెళ్లి జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి అమల కూడా ఓటేసినట్లు తెలుస్తోంది. 

సో నాగార్జున ఆ మేరకు ఓకె అన్నట్లు, ఇక హైదరాబాద్ లో మాత్రం భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్చిలో పెళ్లి కేవలం కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితం అవుతుందని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?