Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పొలాచ్చి కి పవన్?

పొలాచ్చి కి పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలాచ్చికి వెళ్లనున్నారు దాదాపు నెల రోజుల పాటు అక్కడే వుండే అవకాశం వుంది. కానీ ఇదంతా ఇప్పుడే కాదు. వచ్చే ఏడాది ప్రారంభంలో కావచ్చు.

విషయం ఏమిటంటే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో నటించడానికి పవన్ స్టార్ ఆసక్తిగా వున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ లో రానా కూడా వుంటారు. ఈ సినిమాకు ఎకాఎకి 30 నుంచి 35 రోజుల కాల్ షీట్లు చాలు.

అందువల్ల ఫిబ్రవరి ప్రాంతంలో ఆ మేరకు డేట్ లు ఇస్తే, నేరుగా పోలాచ్చికి వెళ్లిపోయి, అక్కడే ఒకటి రెండు సెట్ లు వేసి, టోటల్ సినిమాను ఫినిష్ చేసే ఆలోచన చేస్తోంది నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఈలోగా వకీల్ సాబ్ ఫినిష్ చేయడం, క్రిష్ సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్ ఫినిష్ చేయడం వంటివి జరగాల్సి వుంది.

క్రిష్ సినిమాలో కాస్త ఎక్కువ జుట్టుతో ఒక గెటప్ వుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ విపరీతంగా జుట్టు పెంచి వున్నది అందుకే అని బోగట్టా. అందువల్ల ఆ గెటప్ తో వున్న సీన్లు ఫినిష్ చేస్తే, లుక్ మార్చేయవచ్చు. అది మార్చాక, అయ్యప్పన్ రీమేక్ మీదకు వెళ్తారు.

అయ్యప్పన్ రీమేక్ కు ఇంకా డైరక్టర్ పేరు ఫిక్స్ కాలేదు. సాగర్ పేరు, అలాగే గోపీచంద్ మలినేని పేరు వినిపిస్తున్నాయి. ఇంకా బాబి లాంటి మరి కొన్ని పేర్లు కూడా పరిశీలనలో వున్నాయి.

ఇదిలా వుంటే అయ్యప్పన్ రీమేక్ చేస్తారు అనుకున్న హీరో రవితేజ వేరే ప్రాజెక్టు కు ఫిక్స్ అయ్యారు. దానికి మారుతి దర్శకత్వం వహిస్తారు. యువి-గీతా సంస్థలు నిర్మిస్తాయి.

జగన్ లేఖ.. జాతి మీడియా తప్ప

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?