Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ల ఆనందం నటన మాత్రమే: పూనమ్ కౌర్

హీరోయిన్ల ఆనందం నటన మాత్రమే: పూనమ్ కౌర్

నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు పైకి మాత్రమే ఆనందంగా కనిపిస్తూ ఉంటారని, లోలోన మాత్రం వారు చాలాబాధతో ఉంటారని పూనమ్ అంటోంది. ఇండస్ట్రీలో పరిస్థితులు, వ్యక్తిగత జీవితాల విషయంలో హీరోయిన్లు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారని, వాటన్నింటినీ లోపల దాచుకుని పైకిమాత్రం నటీమణులు ఆనందంగా కనిపిస్తుంటారని ఈ హీరోయిన్ వ్యాఖ్యానించింది.

కేవలం కాస్టింగ్ కౌచ్ అనే కాకుండా, హీరోయిన్లను వేధించే ఇతర అంశాలను కూడా పూనమ్ ప్రస్తావించింది. హీరోలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఎంచక్కా పెళ్లి చేసేసుకుంటారని, పెళ్లి తర్వాత కూడా ముందులాగే వాళ్లు కెరీర్ ను కొనసాగించగలరని పూనమ్ అంటోంది. అయితే హీరోయిన్లు మాత్రం తగిన వయసులో పెళ్లి చేసుకోలేరని, కెరీర్ కాపాడుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మార్గం కావడంతో వాళ్లు.. వయసుకు తగిన ముచ్చటను కూడా తీర్చుకోలేరని పూనమ్ చెబుతోంది.

ఈమాట నిజమే. హీరోయిన్లు పైకైతే పెళ్లంటే ఆసక్తి చూపినట్టుగా మాట్లాడరు. పెళ్లా.. అప్పుడేనా.. అంటూ నవ్వులు చిందిస్తారు, అయితే వాళ్లకు పెళ్లంటే ప్రత్యేకమైన ద్వేషం ఏమీ ఉండదు. కేవలం కెరీర్ కోసం, పెళ్లైతే అవకాశాలు దక్కవు, పెళ్లైతే సినిమాల్లో చేయడానికి భర్త అనుమతి ఇస్తాడో లేదో.. అనే రీజన్ల వల్లనే వాళ్లు పెళ్లికి దూరంగా ఉంటారనేది బహిరంగ రహస్యం. ఈ విషయాన్నే పూనమ్ ప్రస్తావిస్తోంది.

ఇక కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలు, ఇతర లైంగిక వేధింపులు హీరోయిన్లకు ప్రశాంతత లేకుండా చేస్తాయని.. గ్లామరస్ ప్రపంచంలో, తళుకుబెళుకుల మధ్యన చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నా హీరోయిన్లకు ఆ ఆనందం మాత్రం లోపల ఉండదని, పైకి చేసేదంతా నటనే అని ఈమె చెబుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?