Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ బాలీవుడ్ భారీ సినిమాకు ప్రభాస్ నో చెప్పాడు!

 ఆ బాలీవుడ్ భారీ సినిమాకు ప్రభాస్ నో చెప్పాడు!

‘పద్మావత్’ సినిమా రూపకర్త సంజయ్ లీల భన్సాలీ తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన తన సినిమా ‘పద్మావత్’లో తను ముందుగా అనుకున్న స్టార్స్ గురించి వివరించారు. విడుదల తర్వాత కన్నా విడుదలకు ముందు ‘పద్మావత్’ తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రూపకల్పన తీరుపై ఉత్తరాదిన తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరకు టైటిల్ మార్చి విడుదల చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు విషయం ఏమిటంటే.. ‘పద్మావత్’లో నటించమని తను తెలుగు హీరో ప్రభాస్ ను సంప్రదించినట్టుగా భన్సాలీ వివరించాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ చేసిన పాత్రకు ప్రభాస్‌ను తను పరిగణనలోకి తీసుకున్నానని ఈ దర్శకుడు పేర్కొన్నాడు. బాహుబలిలో ప్రభాస్‌ను చూసి అతడు తన సినిమాకు సరైన ఎంపిక అవుతాడని అనుకున్నానని భన్సాలీ వివరించాడు. తన సినిమాలో నటించమని ప్రభాస్‌తో తను ప్రతిపాదించగా.. అతడు కూడా ఆనందంగా ఒప్పుకున్నాడని ఈ దర్శకుడు పేర్కొన్నాడు.

తన మేకింగ్‌లో వస్తున్న సినిమాలో నటించేందుకు ప్రభాస్ ముందు ఆసక్తిచూపినా, తీరా కథ విన్న తర్వాత మాత్రం నో చెప్పాడని భన్సాలీ చెప్పాడు. ప్రభాస్ ఎందుకు నిరాకరించి ఉండవచ్చో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఇందులో ప్రధానపాత్ర అల్లవుద్ధీన్ ఖిల్జీది. ఆ పాత్రను అప్పటికే రణ్‌వీర్ సింగ్‌ను ఎంచుకున్నాడు భన్సాలీ. ఇక టైటిల్ రోల్ ఎలాగూ దీపికకు దక్కింది. సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర పద్మావతి భర్తది. ఆ పాత్రనే ప్రభాస్‌కు ఇస్తానని భన్సాలీ ప్రతిపాదించినట్టుగా ఉన్నాడు. దీంతో మరో ఆలోచన లేకుండా ప్రభాస్ నో చెప్పి ఉండవచ్చు.

భారీ సినిమానే అయినా, భన్సాలీ దర్శకుడు అయినా.. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రతో బాలీవుడ్‌లోకి ఇంట్రడ్యూస్ కావాలని ప్రభాస్ అనుకోడు కదా. అందుకే నో అనేసి ఉండవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?