Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్‌ స్టామినా సరే, సక్సెస్‌ మాటేమిటి?

ప్రభాస్‌ స్టామినా సరే, సక్సెస్‌ మాటేమిటి?

'సాహో' చిత్రానికి రెండు వందల అరవై అయిదు కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరుగుతోందని అంచనా. బాహుబలి 2 విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీ రేట్లకి విక్రయిస్తున్నారు. బాహుబలి తర్వాత ఇండియాలో ఇంత మొత్తానికి అమ్ముడయిన చిత్రం ఇదేనట. తెలుగు రాష్ట్రాలలోనే నూట ఇరవై కోట్ల బిజినెస్‌ జరుగుతున్నట్టు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాలలోను మంచి బిజినెస్‌ జరిగింది. ప్రతి ఒక్కరూ బాముబలి 2 మాదిరిగా ఇది కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో కొనేస్తున్నట్టున్నారు. అయితే బాహుబలి 2 స్థాయిలో సాహోకి క్రేజ్‌ వుందా? వుంటే ఆ అంచనాలని ఈ చిత్రం అందుకోగలదా? బాహుబలి తర్వాత చేసే చిత్రం ఆ స్థాయికి తగ్గరాదనే నిర్మాతల ప్రయత్నం అయితే ఫలించింది.

సాహో చిత్రానికి పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కింది. ఇతర భాషలలోను ఈ చిత్రంతో పోటీ పడడానికి స్టార్లు కంగారు పడే పరిస్థితి వుంది. అయితే ఇది పూర్తిగా ప్రభాస్‌ క్రేజేనా లేక బాహుబలి ఆఫ్టర్‌ ఎఫెక్టా అనేది కూడా సాహోతో తేలిపోతుంది. ఈ చిత్రంతో ప్రభాస్‌ స్టామినా ఏమిటనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఇక ఆ అంచనాలకి తగ్గట్టు విజయం దక్కితే మాత్రం ప్రభాస్‌కి ఎదురే లేదని ఒప్పుకోవాలి. 

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?