cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ వదిలేసిన సినిమా

ప్రభాస్ వదిలేసిన సినిమా

ప్రభాస్ సాహో సినిమా ఫినిష్ చేసే బిజీలో వున్న సమయం అది. అలాంటి టైమ్ లో మైత్రీ మూవీస్ సంస్త ఓ డైరక్టర్ ను తీసుకుని, అద్భుతమైన కథతో వచ్చింది. ఆ డైరక్టర్ భారీ సినిమాలు తీయకపోవచ్చు. కానీ మంచి సినిమాలు తీసారు. ఒక్కసారి కథ వినండి అన్నారు. సూపర్ కాప్ స్టోరీ. అదిరిపోయింది. కానీ ప్రభాస్ సారీ అన్నారు. 

ఎందుకుంటే ఆ సినిమాకు ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. అప్పటికే సాహో సినిమా లేట్ తో కాస్త ఫ్రస్టేషన్ తో వున్నారు. సో..నో అనేసారు. ఏళ్లకు ఏళ్లు పట్టే సినిమాలు తాను చేయాలని అనుకోవడం లేదన్నారు. ఈ సినిమాకు హీరో డేట్ లు దాదాపు ఎనిమిది నెలలు కావాల్సి వుంటుంది. 

వెంటనే మైత్రీ వేరే హీరోకి ఆ కథ చెప్పించింది. ఓకె అయిపోయింది. కానీ మళ్లీ చిన్న సమస్య.  ఇప్పటికిప్పుడు అంత భారీ సినిమాను తలెకెత్తుకోవడానికి మైత్రీ వెనుకంజ వేసింది. ఈ ప్రాజెక్టును ఏస్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజకు అప్పగించేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అక్కడ వుంది. ఎవరు మరి ఆ సూపర్ పోలీస్ సినిమా దిల్ రాజు ఎప్పుడు నిర్మిస్తారో చూడాలి. ఎప్పుడు నిర్మించినా, కనీసం రెండేళ్లు పడుతుంది అని బోగట్టా,. ఇంతకీ ఆ డైరక్టర్ పేరు చెప్పలేదు కదా...ఇంద్రగంటి మోహన కృష్ణ. ఈ సినిమా పూర్తయి బయటకు వస్తే, అప్పుడు ఆయన లో ఈ యాంగిల్ కూడా బయటకువస్తుంది. 

విశాఖలో వై ఎస్ జగన్

టీడీపీవాళ్ళు తాగే బ్రాండ్స్ మాదగ్గర లేవు