తెలుగు సినీ పరిశ్రమలో నయా ప్రేమపక్షులెవరంటే, అందరి నోటా ఒకటే మాట విన్పిస్తోంది.. ఆ జంట ఎవరో కాదు, నాగచైతన్య – సమంత. 'ఏ మాయ చేశావె' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ఈ జంట, ఇప్పుడు రియల్ లైఫ్‌లో 'జంట' కాబోతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదుగానీ, ఓ సినీ హీరోని పెళ్ళాడబోతున్నానంటూ 'నోరు జారిన' సమంత, తన పెళ్ళి గురించి ఎంత పబ్లిసిటీ చేసుకోవాలో అంతా చేసేసుకుంది.
ఆ వెంటనే నాగచైతన్య, సమంత జంటగా 'కెమెరా'కి చిక్కేశారు. ఓ సినిమా థియేటర్‌లో వీళ్ళిద్దర్నీ 'కనిపెట్టిన' కొందరు, ఆ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఆ తర్వాత మరోసారి ఇలాగే ఈ ప్రేమపక్షలు కెమెరాకి చిక్కేశారు. రోజులు గడుస్తున్నాయి.. ఒక్కో ఫొటో బయటకు వస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచిగానీ, సమంత వైపు నుంచిగానీ ఈ ఫొటోలపై స్పందన రాకపోవడం గమనార్హం.
వీరిద్దరి ప్రేమా, పెళ్ళి పీటలెక్కనుండడం ఖాయమే అయితే, ఈ పాటికి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసేవారే. 'పెళ్ళి కబురు విషయంలో నాగార్జున కూడా సానుకూలంగా వున్నాడట..' అన్న గాసిప్స్ కూడా సినీ వర్గాల నుంచే గుప్పుమంటున్నాయి. నాగార్జున ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ఒప్పేసుకున్నాడట కూడా. అయితే ఇవి కూడా 'అట'లు మాత్రమే. ఇంకోపక్క, అఖిల్ లవర్.. అంటూ అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఓ కుటుంబానికి చెందిన యువతి ఫొటోని మీడియా వెలుగులోకి తెచ్చింది. దాని మీదా సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ మధ్య అఖిల్ జోరు తగ్గిందిగానీ, నాగచైతన్య ప్రేమాయణం మాత్రం పీక్స్‌కి వెళ్ళిందన్నట్లు ఫొటోలు కొత్త కొత్తగా తెరపైకొస్తున్నాయి. ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందోగానీ, ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో హాటెస్ట్ కపుల్ అని సమంత – నాగచైతన్య గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.