Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరీ చేతిలో.. ఇన్ని క్రేజీ సినిమాలా..!

పూరీ చేతిలో.. ఇన్ని క్రేజీ సినిమాలా..!

మొత్తానికి వరస ప్లాఫుల్లో ఉన్నా పూరీ జగన్నాథ్ స్థాయి ఏ మాత్రం తగ్గడం లా! స్టార్ హీరోల సినిమాలు, మల్టీ స్టారర్లు.. ఇవే పూరీ ప్రాజెక్టులు! ఇవన్నీ పుకార్లు, ఊహాగానాలు అయితేనేం.. వినడానికి అయితే యమ క్రేజీగా ఉన్నాయి కదా!

పట్టాలెక్కుతాయో లేదో తెలీదు కానీ.. పూరీ జగన్నాథ్ పేరు మాత్రం ఈ క్రేజీ సినిమాలతో వినిపిస్తోంది. ఒకటా రెండా.. కొంత కాలంగా పూరీ చేయబోయే సినిమాలు అంటూ బోలెడు ప్రచారంలోకి వచ్చాయి!

మహేశ్ బాబుతో ‘జనగణమణ’, అభిషేక్ బచ్చన్ తో ‘ఇజం’ రీమేక్, ఇక ‘గౌతమీ పుత్రశతకర్ణి’ తర్వాత బాలయ్యతో ఒక సినిమా.. ఇవే అనుకుంటే, ఎన్టీఆర్ తో ఒక సినిమా, ఎన్టీఆర్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇంకో సినిమా అట!

ఇవన్నీ ‘లోఫర్’ ‘ఇజం’ వంటి ఫ్లాఫులు ఇచ్చిన దర్శకుడి తర్వాతి సినిమాలు. ఏ మాత్రం ఫామ్ లో లేని పూరీ పేరుతో ముడిపడి వినిపిస్తున్న పేర్లు ఇవి. అయితే.. ఈ ప్రాజెక్టులు అసలు పట్టాలెక్కుతాయో, పుకార్లుగానే మిగిలిపోతాయో ఎవరికీ తెలీదు. పూరీ ఈ సినిమాల ప్లాన్ లో ఉన్నాడని మీడియాకు ఉప్పందుతుంది.. ఈ సినిమాల వివరాలు ప్రచారంలోకి వచ్చేస్తాయ్! మిగిలిన సందేహాలకు కాలమే సమాధానం ఇస్తుందంతే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?